https://oktelugu.com/

Prakash Raj: జైభీమ్ సినిమా ముఖ్య ఉద్దేశాన్ని వదిలేసి .. ఆ ఒక్క సీన్​పైనే ఎందుకు పడ్డారు!

Prakash Raj: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జై భీమ్​. ఇటీవలే అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్​ అందుకుంది. మరోవైపు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ ఈ సినిమాపై స్పందించారు. వాస్తవ ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, ఈ సినిమాలోని ప్రకాశ్​ రాజ్​ నటించిన ఓ సీన్​ పెను దుమారం రేపింది. అందులో ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 12:57 PM IST
    Follow us on

    Prakash Raj: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జై భీమ్​. ఇటీవలే అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్​ అందుకుంది. మరోవైపు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ ఈ సినిమాపై స్పందించారు. వాస్తవ ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే, ఈ సినిమాలోని ప్రకాశ్​ రాజ్​ నటించిన ఓ సీన్​ పెను దుమారం రేపింది. అందులో ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం చెంప పగలగొట్టడం వివాదాస్పదంగా మారింది. ఇది హిందీ భాషను అవమానించడమే అంటూ కొందరు కామెంట్ల వర్షం కురిపించారు. దీనిపై ప్రకాశ్​ రాజ్​ స్పందించారు.

    ఈ సినిమాలో అణగారిన వర్గాల బాధను సమాజానికి చూపించాలనుకున్నామని.. వాళ్ల కష్టాల్ని చెప్పామని అన్నారు. కానీ, కొంతమంది ఈ సినిమాలోని చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తననే కావాలని టార్గెట్​ చేసి.. ఈ సినిమాను వివాదంలోకి లాగారని అన్నారు. ఇటువంటి వివాదాలకు స్పందించడంలో ఎటువంటి అర్ధం లేదని కొట్టిపడేశారు.

    కాగా, న్యాయవాది చంద్రు నిజ జీవితంలో వాదించిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జ్ఞానవేల్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో 1990ల కాలంలో దళితులపై పోలీసులు, రాజకీయ వర్గాలు తదితరులు ఎలా ప్రవరించేవారో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ క్రమంలోనే చంద్రు పాత్రలో నటించిన సూర్య.. వారికి అండగా ఉంటూ చేసిన పోరాటం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ సినిమాపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. చిత్ర యూనిట్​పై ప్రశంసలు కురిపించారు.