Prakash raj: విలన్‌గా భయపెట్టడంలోనైనా, ఎమోషనల్‌గా ఏడిపించడంలోనైనా, కడుపుబ్బా నవ్వించండంలోనైనా ఎలాంటి పాత్రలైనా ఇట్టే ఒదిగిపోయి మెప్పించే నటుడు ప్రకాశ్‌రాజ్. ఇటీవలే మా ఎలక్షన్స్‌లోనూ అధ్యక్ష పదవికి నిలబడి మంచు విష్ణుకు గట్టిపోటీ ఇచ్చారు. అయితే, ఇందులో ప్రకాశ్‌రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.అనంతరం తన సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రజలకు మంచి చేయాలంటే పదవిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు, తన ఫ్యామిలీ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రకాశ్‌రాజ్ మొదట్లో లలిత కుమారిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2009లో వీరిద్దరు విడాకులు తీసుకున్నాక.. ప్రకాశ్‌రాజ్ బాలీవుడ్ డ్యాన్సర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఈ క్రమంలోనే తన పిల్లలకు ఎప్పుడు తోడుగా ఉంటానని ఇంటర్వ్యూలో ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ప్రస్తుతం తన పెద్ద కుమార్తె పూజ చదువు పూర్తి చేసుకుందని, సంగీతంలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. సినీ పరిశ్రమలో వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెద్ద కుమార్తె వివాహం గురించి ప్రస్తావించగా.. పెళ్లికి కావాల్సిన అవసరాలు తీరుస్తాను కానీ.. ఒక తండ్రిగా ఉండలేనని స్పష్టం చేశారు.
వారు పిలిస్తే పెళ్లికి వెళ్లి అక్షింతలు వేస్తానని ఈ విషయం తన కూతురుకు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకు ఆమె కూడా సరేనన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.