https://oktelugu.com/

Hero Prabhas: ఆయన ఓ చిన్నపాటి దేవుడిలా కనిపిస్తున్నారు కదా?- ప్రభాస్​

Hero Prabhas: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్​. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​, సాంగ్స్, టీజర్​లు సినిమాపై భారీ హైప్​ను క్రియేట్ చేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తోన్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 11:35 AM IST
    Follow us on

    Hero Prabhas: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్​. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్​, సాంగ్స్, టీజర్​లు సినిమాపై భారీ హైప్​ను క్రియేట్ చేశాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ నుంచి వస్తోన్న భారీ సినిమా కావడంతో అంచనాలు కూడా అదే రేంజ్​లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్​లో వేగవంతం చేస్తూ.. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్​గా ప్రీరిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించారు.

    Hero Prabhas

    Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

    ఈ వేదికపైనా రాధేశ్యామ్​ ట్రైలర్​ను విడుదల  చేశారు మేకర్స్​. అనంతరం ప్రభాస్​ అభిమానులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.. ట్రైలర్​ మీరే లాంచ్ చేశారు. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. పెదనాన్న గారి  ఫొటోను చూశారు కదా.. ఎలా ఉన్నారు?.. ఓ చిన్నపాటి దేవుడిగా కనిపిస్తున్నారు కదా?..  రాధేశ్యామ్​ ఓ ప్యూర్​ లవ్​ స్టోరీ.. కరోనా సమయంలో అందరం ఎంతో కష్టపడి ఈ సినిమా కంప్లీట్ చేశాం. పెదనాన్న, సత్యరాజ్​, సచిన్​, జయరామ్, భాగ్య శ్రీ గారికి చాలా థ్యాంక్స్. జగపతి బాబు గెస్ట్ అప్పియరెన్స్​లో మంచి పాత్ర పోషించారు. అంటూ పేర్కొన్నారు.

    కాగా, సాహో సినిమా సమయంలో దేశమంతా తిరిగానని.. సిగ్గుపోయి అందరితో కలివిడిగా ఉండాలని  ప్రయత్నించినా.. ఇంకా పోవడం లేదని అన్నారు.. ఈ సారి మీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను.. ఇదంతా మీ వల్లే జరిగిందంచూ.. ప్రభాస్ వివరించాడు.

    Also Read: రాధేశ్యామ్​ నుంచి సంచారి ఫుల్​సాంగ్​ విడుదల.. సూపర్ అంటున్న నెటిజన్లు