Karthika Deepam Serial Actor: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగింటి ఆడపడుచుల ఫేవరెట్ మరియు మోస్ట్ వాంటెడ్ సీరియల్ గా హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకెళుతోంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు పోషిస్తున్న వారి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. వారి అసలు పేర్లు కంటే కూడా సీరియల్ పాత్రల తోనే ఫేమస్ అయ్యారు ఈ జంట. కాగా డాక్టర్ బాబు క్యారెక్టర్ చేస్తున్న నిరుపమ్ పలు సీరియల్ లలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. అతని భార్య మంజుల నిరుపమ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇద్దరు బుల్లి తెర నటీనటులు కావడంతో వీరిద్దరికీ అధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల తక్కువ సమయం లోనే ఎక్కువ మంది సబ్ స్కైబర్లను సొంతం చేసుకున్నారు. ఇక వీరు ఒక వీడియో పోస్ట్ చేయడమే ఆలస్యం వెంటనే మిలియన్ సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంటారు. తాజాగా వీరు వీరీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫోన్లో ఉన్న సీక్రెట్స్ గురించి ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో నిరుపమ్ కొడుకు రిక్కీ అడిగే ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానం చెబుతూ ఉంటారు.
Also Read: బీజేపీ ని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్.. అక్రమ అరెస్టులపై బీజేపీ నేతల గుర్రు
ఇక తన తండ్రిని మీరు ఫోన్ లో ఎక్కువగా ఎవరితో మాట్లాడుతారని ప్రశ్నించారు. ఆ ప్రశ్న అడిగిన వెంటనే మంజుల స్పందిస్తూ నాతో అయితే కాదు అంటూ సమాధానం చెప్పింది. డబ్బింగ్, మేనేజర్లతో ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడతాను అని చెబుతుండగా అంతలోనే మంజుల మాట్లాడుతూ… కృష్ణ కాంత్ గారితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు చూసినా అతని తోనే మాట్లాడుతారు లొకేషన్ లోనూ, లొకేషన్ నుంచి ఇంటికి రాగానే ఆయనతోనే మాట్లాడతారని తన భర్త పై మంజుల సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.