షాకింగ్ : ప్రముఖ దర్శకుడు నటుడు మృతి !

తెలుగు సినిమా నటుడు ఇరుగు గిరిధర్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. నటుడిగా అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆయనకు ఐదేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి మంచానికే గిరిధర్ పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఆయన మానసికంగా బాగా బలహీన పడిపోయారు. ఆ బాధతోనే ఆయన తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. చివరకు నిన్న తిరుపతిలోని తన నివాసంలో ఆయన తన తుదిశ్వాస విడిచారు. […]

Written By: admin, Updated On : August 2, 2021 11:21 am
Follow us on

తెలుగు సినిమా నటుడు ఇరుగు గిరిధర్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. నటుడిగా అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆయనకు ఐదేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుండి మంచానికే గిరిధర్ పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఆయన మానసికంగా బాగా బలహీన పడిపోయారు.

ఆ బాధతోనే ఆయన తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. చివరకు నిన్న తిరుపతిలోని తన నివాసంలో ఆయన తన తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఇరుగు గిరిధర్‌ జన్మించారు. ఆయనకు చిన్న తనం నుండి సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ తోనే 1982లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.

అయితే, ఆయన దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు. మొదట్లో సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పలు సినిమాలకు పని చేశారు. అలాగే గుడుంబా శంకర్, అన్నవరం వంటి సినిమాలకు కోడైరెక్టర్‌ గానూ గిరిధర్‌ పనిచేయడం జరిగింది. అలాగే ‘శుభముహూర్తం’ అనే సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.

కానీ, ఆయన దర్శకుడిగా నిలబడలేకపోయారు. నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాక.. ఆయన కెరీర్ లో సెటిల్ అయ్యారు. 100 పర్సంట్ లవ్ సినిమాలో తమన్నా ఫాదర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆలాగే సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో ఆయన నటించారు.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ఇరుగు గిరిధర్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.