https://oktelugu.com/

ఒలింపిక్స్: భారత మహిళా హాకీ జట్టు సంచలనం

అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. ప్రపంచ క్రీడా సంరంభం ‘ఒలింపిక్స్’లో దుమ్ము రేపుతున్నారు. నిన్న మన పీవీ సింధు ఏకంగా కాంస్య పతకం సాధించగా.. తాజాగా మన మహిళల హాకీ జట్టు ఏకంగా ప్రపంచ ఫేవరేట్ టీం ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత భారత పురుషుల జట్టు ఇటీవలే సెమీస్ లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించగా.. తాజాగా మహిళల హాకీ చట్టు చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 / 11:02 AM IST
    Follow us on

    అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. ప్రపంచ క్రీడా సంరంభం ‘ఒలింపిక్స్’లో దుమ్ము రేపుతున్నారు. నిన్న మన పీవీ సింధు ఏకంగా కాంస్య పతకం సాధించగా.. తాజాగా మన మహిళల హాకీ జట్టు ఏకంగా ప్రపంచ ఫేవరేట్ టీం ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత భారత పురుషుల జట్టు ఇటీవలే సెమీస్ లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించగా.. తాజాగా మహిళల హాకీ చట్టు చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ కు దూసుకెళ్లింది. సమీకరణాల ఆధారంగా క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత మహిళా జట్టు.. క్వార్టర్స్ లో బలమైన ఆస్ట్రేలియా మహిళల హాకీ టీంను ఓడించి సెమీస్ కు చేరింది. 1-0 గోల్స్ తేడాతో టీమిండియా ఈ విషయాన్ని సాధించింది.

    ఒలింపిక్స్ హాకీలోనే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు భారత మహిళలు తమ అద్భుత ఆటతీరుతో షాకిచ్చారు. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన భారత జట్టు సెమీస్ కు చేరి పతకంపై ఆశలు రేపుతోంది. కనీసం ఒక పతాకానికి మరో విజయం దూరంలో భారత మహిళా హాకీ జట్టు చేరింది.

    భారత్ మహిళల హాకీ జట్టు చివరి సారి 1980లో ఒలింపిక్స్ లో పతకం సాధించింది. పురుషుల హాకీ జట్టు ఆ పతకాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత హాకీలో భారత్ ప్రదర్శన ఏమాత్రం బాగోలేక వరుసగా ఓటములే ఎదురయ్యాయి. 40 ఏళ్లుగా ఒలింపిక్స్ లో మనవాళ్లు ఫైనల్ చేరలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    మూడేళ్ల కిందట ప్రపంచకప్ హాకీలో కూడా భారత మహిళా హాకీ జట్టు ప్రదర్శన బాగుందని గుర్తు చేస్తున్నారు. సునాయస విజయం సాధిస్తామనుకున్న ఆస్ట్రేలియన్ టీం ఈ ఓటమితో ఖంగుతింది. 1-0తో ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియన్ మహిళా టీం సభ్యులు స్టేడియంలోనే ఏడ్చేశారు.

    ఇక మ్యాచ్ లో ఫెనాల్టీ కార్నర్ ద్వారానే భారత్కు విజయం దక్కింది. ఆస్ట్రేలియాకు ఏడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినా భారత జట్టు అడ్డుకుంది. భారత డిఫెన్స్ అద్భుతంగా సాగింది. రెండో క్వార్టర్ లో భారత్ పెనాల్టీ అవకాశాన్ని గోల్ గా మలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు అవకాశం ఇవ్వకుండా తొలిసారి సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.