ఈశాన్య భారతదేశంలో రాజకీయాలకు కేంద్ర బిందువైన మణిపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు సాధించినా బీజేపీ 21 సీట్లే దక్కించుకుంది. కకానీ నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 4, లోక్ జనశక్తి ఒక చోట, స్వతంత్ర అభ్యర్థి మరో చోట విజయం సాధించడంతో వీరిని కలుపుకుని బీజేపీ అధికారం హస్తగతం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.
ఇక గోవాలో కూడా ఇదే తరహాలో అధికారం చేజిక్కించుకుంది. 40 సీట్లున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 17, బీజేపీకి 13 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కానీ బీజేపీ ఆడిన నాటకంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతయింది. అధికారమే పరమావధిగా బీజేపీ పకడ్బందీ చర్యలు చేపట్టి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మనోహర్ పారికర్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఆయనకు పదవిపై ఇష్టం లేకున్నా అధిష్టానం ఒత్తిడి మేరకు పారికర్ పగ్గాలు చేపట్టినట్లు తెలిసిందే.
రెండేళ్ల తరువాత పారికర్ మరణంతో ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సారి తన శక్తులన్ని ఒడ్డి గోవాలో పీఠం దక్కించుకోవాలని భావిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు గిరీష్ బోడంకర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. బీజేపీని దెబ్బ కొట్టాలని సకల శక్తులు ఏకం చేసేందుకు సంసిద్దమవుతున్నారు. బీజేపీని నిలువరించి గోవాలో పాగా వేస్తామని ప్రకటించారు.