Guild: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అస్తవ్యస్తం గా ఉంది. రోజుకొక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. ఇక ప్రొడక్షన్ కౌన్సిల్ లో అయితే ఎప్పుడూ కోల్డ్ వార్స్ నడుస్తూనే ఉంటాయి…ప్రస్తుతం ప్రొడక్షన్ కాన్సిల్ లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యం లో ఇప్పుడు ఫిలిం ఛాంబర్ మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక దానికి తోడుగా గత కొన్నిరోజుల నుంచి సినిమా టిక్కెట్ రేట్లు పెంచడం మీద చాలా మంది విమర్శలను చేస్తున్నారు. ఇక ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఇండస్ట్రీ ని నడిపిస్తున్నది ఎవరు? అనే విషయం మీద కొన్ని కామెంట్స్ చేశారు…ప్రస్తుతం GUILD లో ఉన్నవాళ్ళందరూ కూడా నామ మాత్రం వాళ్లే వీళ్ళ వెనకాల ఒక పెద్ద బాస్ ఉన్నాడు. ఆయన చేతిలోనే చాలా సినిమా ఇండస్ట్రీ ఉంది. థియేటర్లు ఉన్నాయి, క్యూబ్, యుఎఫ్ఓ ఉంది. ఆ బాస్ ఎలా చెబితే వీళ్ళు అలా నడుచుకుంటారు.
ఆయన GUILD ను తీసుకువచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కలుపుతా అన్నారు… కంప్లీట్ గా క్యూబ్, యుఎఫ్ఓ లు లేకుండా చేస్తాం అన్నారు…ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పేపర్ మీడియా కానీ మొత్తం తీసుకువచ్చి కలుపుతా అన్నారు…ఇప్పుడు ఏమైంది…
ఆ బాస్ బయటికి వచ్చి వీటన్నింటిని కలిపితే మేము ఆయనతో మాట్లాడతాం అంటూ ప్రొడ్యూసర్స్ కామెంట్స్ చేశారు…
ఇక ఇదంతా విన్న తర్వాత సగటు ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీ ని ఈ రేంజ్ లో శాసిస్తున్న వ్యక్తి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు… అలాగే సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి గొడవలు లేవు అన్ని సినిమాలను కాపాడటానికి మేమంతా ఒకటై నడుస్తుంటాం అని చెబుతుంటారు.
తీరా చూస్తే వాళ్లలో వాళ్ళే గొడవలు పెట్టుకుంటారు. మీడియా ముందుకు వస్తారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇప్పటికైనా ఇండస్ట్రీ లో ఉన్న వివాదాలను తుడిచిపెడుతూ ప్రేక్షకుడికి తక్కువ టిక్కెట్ రేటుతో సినిమా ను తీసుకువస్తే మంచిది. లేకపోతే సినిమాలు తీసేవారు ఉంటారేమో కానీ సినిమాలను చూసేవారు ఉండరు…