Homeఎంటర్టైన్మెంట్Balakrishna: సినిమాలో నలబై నిమిషాలు ఫైట్లే.. ఇలా ఎలా బాలయ్య ?

Balakrishna: సినిమాలో నలబై నిమిషాలు ఫైట్లే.. ఇలా ఎలా బాలయ్య ?

Balakrishna: నటసింహం బాలయ్య బాబు ఇష్టపడి కష్టపడి యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తోన్న సినిమా ‘అఖండ’. బాలయ్య సినిమా అంటేనే.. రోటీన్ యాక్షన్ కొట్టుడు ఉంటుంది అనేది కామన్. కాబట్టి.. ఈ సినిమా తంతు కూడా అంతే ఉంటుంది. అందుకే.. సినిమాలో ఆరు ఫైట్స్ పెట్టారు. పైగా ఒక్కో ఫైట్ రెండు నిమిషాలకు తక్కువ లేదు. ఇక ఇంటర్వెల్ ఫైట్ అయితే, ఏకంగా ఆరు నిమిషాలు ఉంది. మొత్తంగా చెప్పొచ్చేది ఏమిటంటే.. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో నలబై నిమిషాలు ఫైట్లే ఉన్నాయి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి ఎలా వస్తారు బాలయ్య !
Balakrishna
అదేంటి ? ఇక సినిమాలో కథ లేదా ? అంటే.. ఏమి చెబుతాం.. బాలయ్య సినిమాకు కథ కంటే యాక్షన్ ముఖ్యం, బాలయ్య సినిమాకి స్క్రీన్ ప్లే కంటే.. డైలాగ్స్ ముఖ్యం. కావున.. బోయపాటి పక్కా యాక్షన్ ఊర మాస్ కొట్టుడు వ్యవహారాలతోనే ఈ సినిమాని ముగించాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా షూట్ చివరి దశలో ఉంది.

ప్రస్తుతం గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ సినిమాలో కీలక ఫైట్ సీన్‌ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక బాలయ్య – బోయపాటి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ పడ్డాయి. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ ఈ సినిమా చేస్తున్నారు. అందుకే మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ఈ సినిమా టీజర్ ఏకంగా 70 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ఒక విధంగా బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డు. మొత్తమ్మీద అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాలు కారణంగానే ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది. అన్నిటికి మించి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Oktelugu Epaper
Exit mobile version