Balakrishna: నటసింహం బాలయ్య బాబు ఇష్టపడి కష్టపడి యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తోన్న సినిమా ‘అఖండ’. బాలయ్య సినిమా అంటేనే.. రోటీన్ యాక్షన్ కొట్టుడు ఉంటుంది అనేది కామన్. కాబట్టి.. ఈ సినిమా తంతు కూడా అంతే ఉంటుంది. అందుకే.. సినిమాలో ఆరు ఫైట్స్ పెట్టారు. పైగా ఒక్కో ఫైట్ రెండు నిమిషాలకు తక్కువ లేదు. ఇక ఇంటర్వెల్ ఫైట్ అయితే, ఏకంగా ఆరు నిమిషాలు ఉంది. మొత్తంగా చెప్పొచ్చేది ఏమిటంటే.. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో నలబై నిమిషాలు ఫైట్లే ఉన్నాయి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి ఎలా వస్తారు బాలయ్య !

అదేంటి ? ఇక సినిమాలో కథ లేదా ? అంటే.. ఏమి చెబుతాం.. బాలయ్య సినిమాకు కథ కంటే యాక్షన్ ముఖ్యం, బాలయ్య సినిమాకి స్క్రీన్ ప్లే కంటే.. డైలాగ్స్ ముఖ్యం. కావున.. బోయపాటి పక్కా యాక్షన్ ఊర మాస్ కొట్టుడు వ్యవహారాలతోనే ఈ సినిమాని ముగించాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా షూట్ చివరి దశలో ఉంది.
ప్రస్తుతం గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ సినిమాలో కీలక ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక బాలయ్య – బోయపాటి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ పడ్డాయి. ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ ఈ సినిమా చేస్తున్నారు. అందుకే మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
పైగా ఈ సినిమా టీజర్ ఏకంగా 70 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ఒక విధంగా బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డు. మొత్తమ్మీద అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాలు కారణంగానే ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది. అన్నిటికి మించి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమా థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది.