
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నక్సలైట్ల బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. కరోనా వైరస్ లేకుంటే ఈ పాటికి థియేటర్లలో సందడి చేసేది. అయితే ఇటీవల షూటింగ్ పున: ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లోకి రానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తి విషయం బయటకు వచ్చింది.
ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన కొరటాల శివ సినీ ఫీల్డులోకి రాకముందే ఓ కథను రెడీ చేసుకున్నాడట. ఆ కథతో ఓ పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడట. అయితే చాన్నాళ్లకు కొరటాల శివ కల నెరవేరిందట. ఆయన అప్పుడు రాసుకున్న కథలో పలు మార్పులు చేసి చిరంజీవి, రామ్ చరణ్ ల తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు ఓ పాట విడుదలైన విషయం తెలిసిందే.
ఇటీవల సినిమాలోని కీలక పాయింట్స్ లీకయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే సినిమా మొత్తంలో అదే ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. కొరటాల శివ రాసుకున్న తన కథలో దానిని బేస్ చేసుకొని సినిమా తీశారట. అయితే ఇప్పుడు ఆ పాయింట్స్ మీదనే సినిమా నడుస్తుందని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ విషయాన్ని ఎవరూ బయట పెట్టడం లేదు.
ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో చిరంజీవి సినిమాలకు మణిశర్మ ఎక్కువగా మ్యూజిక్ అందించేవారు. రాను రాను పోటీ పెరగడంతో ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇక ‘ఆచార్య’కు సంబంధించిన లాహె లాహె అనే పాట విడుదలై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.