Homeఎంటర్టైన్మెంట్Acharya Sensor Review: ఆచార్య సెన్సార్ రివ్యూ

Acharya Sensor Review: ఆచార్య సెన్సార్ రివ్యూ

Acharya Sensor Review: కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా మూడేళ్ళ నుండి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ కరోనా కారణంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో సర్దుబాటు కానీ టికెట్ రేట్స్ కారణంగా వాయిదా పడుతూ అభిమానుల సహనం […]

Acharya Sensor Review: కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దాదాపుగా మూడేళ్ళ నుండి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ కరోనా కారణంగా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో సర్దుబాటు కానీ టికెట్ రేట్స్ కారణంగా వాయిదా పడుతూ అభిమానుల సహనం కి పరీక్ష పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇన్నాళ్ల వారి ఎదురు చూపులకు మరో వారం రోజుల్లో తెరపడబోతుండడం తో వారి ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి అని చెప్పొచ్చు..ఇక ఇటీవలే ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ ట్రైలర్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ ని ఒక్కే షాట్స్ లో చూడడం కేవలం అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా చాలా థ్రిల్ ఫీలింగ్ వచ్చింది..ఇక వెండితెర మీద ఈ ఇద్దరి కాంబినేషన్ చేసే మేజిక్ ఎలా ఉంటుందో చూడాలి.

Acharya Sensor Review
Acharya Sensor Review

ఇక ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది..జీరో కట్స్ తో ఈ సినిమాకి సెన్సార్ వారు U/A రేటింగ్ ఇచ్చారు..ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ ని ప్రశంసలతో ముంచి ఎత్తారు అట..చిరంజీవి గారిని ఈ సినిమా ద్వారా కొరటాల శివ చాలా కొత్తగా చూపించాడు అని..రామ్ చరణ్ మరియు చిరంజీవి గారు కలిసి ఉన్న సన్నివేశాలు చూడడానికి తమ రెండు కళ్ళు సరిపోలేదు అని , ఇంకా మెగా అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోవడం ఖాయం అని సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరుకు సినిమా వేరే లెవెల్ లో ఉంది అని..ఇది కొరటాల శివ గారి కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది అని సెన్సార్ సభ్యులు కొనియాడారు అట.

Also Read: Bollywood Directors For Ram Charan: చరణ్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ డైరెక్టర్లు.. త్వరలోనే అభిమానులకు ఒక్క సంచలన ప్రకటన

Acharya Sensor Review
Acharya

అభిమానులందరూ రామ్ చరణ్ ఈ సినిమా లో కేవలం ఒక్క ప్రత్యేక పాత్రలో నటించాడు అని అనుకుంటూ ఉన్నారు..కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం కనిపిస్తాడు అని..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమాని మెగా ముల్టీస్టార్ర్ర్ సినిమా గా కొరటాల శివ తీర్చిదిద్దారు అని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ సన్నివేశాలు ఉన్నాయా లేదా తీసేసారా అంటూ సోషల్ మీడియా లో ఒక్క ప్రచారం జోరుగా సాగుతుంది..ఇటీవల జరిగిన రామ్ చరణ్ మరియు కొరటాల శివ ఇంటర్వ్యూ లో కూడా మూవీ లో పని చేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడి , కాజల్ అగర్వాల్ గురించి మాత్రం ఒక్క ముక్క మాట్లాడకపోవడం తో అభిమానులు ఆమె పాత్ర ని సినిమాని తొలగించేసారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..మరో ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: S S Rajamouli: రాజమౌళి చెప్పిన ఆ మార్పులు చెయ్యడం వల్లే రాధే శ్యామ్ అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందా??

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper