Acharya Pre Release Event: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఈ వేడుక జరుగనున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రాత్రి 11 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

అలాగే, ఈ వేడుకకు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇక బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సహజంగానే మెగా హీరోల సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక ‘ఆచార్య’ లాంటి సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: KGF 2 Collection: KGF 2 : 9 డేస్ కలెక్షన్స్.. అక్కడ నష్టాలు తప్పవా ?
ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 151 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సైరా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా ఇమేజ్ కూడా పడింది. కాబట్టి, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో నలభై కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ఆచార్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 192 కోట్లు జరిగింది.
కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ కావాలంటే.. కనీసం ఈ చిత్రం 193 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాలి. అలాగే, 470 కోట్ల నుంచి 480 కోట్ల దాకా గ్రాస్ ను రాబట్టాల్సి ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందో ? ఈ చిత్రం ఏ రేంజ్ జాతర చేస్తుందో చూడాలి.

అన్నట్టు ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండబోతుంది. చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రన్ టైం సుమారు 2 గంటల 58 నిమిషాలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడు.
‘ఆచార్య’ నుంచి నిన్న రిలీజ్ అయినా ‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో బాగా వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ప్రోమోలో భారీ విజువల్స్, అలాగే చరణ్ – చిరు స్టెప్స్, ముఖ్యంగా చరణ్ – చిరుకు మధ్య ఉన్న స్టెప్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ఇక మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి.
Also Read:Malaika Arora: స్టార్ హీరో ఇంటి కోడలు చిన్న హీరోతో ఎఫైర్.. అసలు తప్పే లేదట !
Recommended Videos: