
Anchor Manjusha : వెండి తెరపై నటిగా.. బుల్లి తెరపై యాంకర్ గా.. సత్తా చాటింది యాంకర్ మంజూష. టీవీ యాంకర్ గా సుపరిచితురాలైన మంజూష.. ‘రాఖీ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లిగా నటించింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చేసినప్పటికీ.. ఆశించిన గుర్తింపురాలేదు.

అయితే.. యాంకర్ గా మాత్రం సక్సెస్ అయ్యింది మంజూష. అందంతోపాటు తనదైన మాటలతో అదరగొడుతుంది. ఇప్పటి వరకూ ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిందీ హైదరాబాదీ బ్యూటీ. ఎన్నో టీవీ షోలలోనూ మెరిసింది. ‘‘ఏ పువ్వైనా మరో పువ్వుతో పోటీపడదు.. వికసిస్తుందంతే! మీరు కూడా ఫ్లవర్స్ మాదిరిగా హ్యాపీగా మీ పనేంటో చేసుకుపోండి’’ అని చెప్పి గత న్యూఇయర్ వేడుకల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజూష.. నెటిజన్లకు అందాల విందులు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు తెగ ట్రై చేస్తున్న ఈ భామ.. హాట్ హాట్ ఫొటోలను రిలీజ్ చేస్తోంది. తాజాగా.. రెడ్ కలర్ నెట్ డ్రెస్ లో లోదుస్తుల అందాలను ప్రదర్శిస్తూ మతి పోగొడుతోంది.

రెడ్ కలర్ నెట్ టాప్ తో బ్లాక్ కలర్ లో దుస్తులతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోందీ భామ. ఓవైపు షోస్ చేస్తూనే.. మరోవైపు యాంకర్‌గా రాణిస్తున్న మంజూష.. ఇటు సోషల్ మీడియాలోనూ తన పాపులారిటీ పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. మరి, ఈ బ్యూటీ ట్రీట్ తో ఈ అమ్మడి లక్ష్యం ఎంత వరకు నెరవేరుతుందన్నది చూడాలి.