Tollywood No 1 Hero: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు వివిధ పరిశ్రమలకు చెందిన నటుల పాపులారిటీ పై సర్వే చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలో 2024 మార్చ్ నెలకు గాను చేసిన సర్వే ఫలితాలు విడుదల చేసింది. టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో మెగా హీరోలు నాలుగు స్థానాలు దక్కించుకోవడం విశేషం. అయితే ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచారు. బాహుబలి చిత్రాలతో ఇండియా వైడ్ ఫ్యాన్ బేస్ సంపాదించిన ప్రభాస్ చాలా కాలంగా టాప్ 1వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక 2వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దక్కించుకున్నారు. మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయనప్పటికీ మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక టాప్ 3 పొజిషన్ లో అల్లు అర్జున్ నిలిచారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. కాగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అనంతరం 4వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆయన దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 10న దేవర విడుదల కానుంది.
ఇక 5వ స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దక్కింది. ఇక 6వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల పై ఫోకస్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా హాయ్ నాన్న తో సూపర్ హిట్ కొట్టిన హీరో నాని 7వ స్థానంలో ఉన్నారు. మాస్ మహారాజ్ రవితేజ 8వ స్థానం దక్కించుకున్నాడు. 9వ స్థానంలో విజయ్ దేవరకొండ, 10వ స్థానంలో చిరంజీవి నిలిచాడు. తాజా సర్వే ప్రకారం ప్రభాస్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు.