Star Heroes: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా భారీగా కొనసాగుతుంది. ఇక ఇప్పటికే గత సంవత్సరం సలార్ సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించగా, ఈ సినిమా దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ప్రభాస్ స్టామినాను మరొకసారి ప్రూవ్ చేసింది.
ఇక ఇదిలా ఉంటే 2024 వ సంవత్సరం వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ, సంక్రాంతికి వచ్చిన సినిమాలను మినహాయిస్తే, ఇప్పటి వరకు ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇక మన స్టార్ హీరోలు అందరూ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రంగం లోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదట కల్కి సినిమా జూలై లో రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్ లో ఓజి, అక్టోబర్ లో ఎన్బికే 109, దేవర, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు సెకండ్ హాఫ్ లో రంగంలోకి దిగబోతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ అన్ని సినిమాలు కలిపి దాదాపు 6000 కోట్ల వరకు బిజినెస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అన్ని బడా హీరోల సినిమాలే కావడం వల్ల ఒక్కో సినిమా వెయ్యి కోట్ల టార్గెట్ ని పెట్టుకొని బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి ఈ అన్ని సినిమాలు తమ తమ రేంజ్ ను బట్టి ఎంతవరకు కలెక్షన్లు రాబడతాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే ఫస్ట్ హాఫ్ లో డీలా పడ్డ తెలుగు సినిమాలు, సెకండాఫ్ లో మాత్రం భారీ రేంజ్ లో రెచ్చిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నయ్.
ఇక ఈ హై వోల్టేజ్ సినిమాల ప్రభంజనాన్ని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలతో తెలుగు సినిమా స్టాండర్డ్ అనేది మరింత గా పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చి రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు… చూడాలి మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి సక్సెస్ ను నమోదు చేసుకుంటుందో…