Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబం ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మహేశ్, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. మంచి భోజన, సరదా కబుర్లతో గడిపిన అనంతంరం శనివారం సాయంత్రం స్నేహితులకో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో మహేశ్‌కు ఉన్న అతికొద్ది మంది సన్నిహితుల్లో వంశీ ఒకరు. వీరితో పాటు పిక్‌లో పలువురు కనిపిస్తున్నారు.

కాగా, ఈ ఫొటోలను నమ్రత ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, టాలీవుడ్లో ప్రేమ జంటగా కలిసి.. మూడుముళ్లతో ఒకటైన వారిలో మహేశ్ నమ్రత కూడా ఒకరు. ఇప్పటికీ అన్యూణ్య దంపతుల్లా కలిసిమెలసి జీవిస్తుంటారు. మరోవైపు, మహేశ్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేశ్ ఫుయ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు.