Abhishek Bachchan- Aishwarya Rai: ఇటీవల కాలం లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన విడాకులకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి..ఒకరికోసం ఒకరు పుట్టారు అనేంతలా అనిపించే జంటలు కూడా ఇటీవల కాలం లో విడాకులు తీసుకున్న సందర్భాలు ఎన్నో మనం చూసాము..ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ లు విడిపోనున్నారని వార్తలు సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది..బాలీవుడ్ నెంబర్ 1 హీరో అమితాబ్ బచ్చన్ గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ కెరీర్ ప్రారంభం లో ఒకటి రెండు హిట్లు కొట్టినా, అమితాబ్ బచ్చన్ లాగ సూపర్ స్టార్ స్టేటస్ ని అందుకోవడం లో విఫలం అయ్యాడు..కానీ ఆయన విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తరుచూ వార్తల్లో ఉంటూ ట్రెండ్ అవుతూ ఉండేవాడు..2007 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్న ఈ జంట కి పదేళ్ల పాప కూడా ఉంది.

అయితే సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ఈ వార్తలపై అభిషేక్ బచ్చన్ స్పందించాడు..ఆయన మాట్లాడుతూ ‘ఐశ్వర్య రాయ్ తో విడాకులు తీసుకోవడానికి నేను సిద్దమే..కానీ నాకు రెండో పెళ్లి ఈ పుకార్లు పుట్టించిన వాళ్ళే చెయ్యాలి..లేదంటే ఒప్పుకోను’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు..15 ఏళ్ళ మా దాంపత్య జీవితం లో మేము గొడవలు పడిన సందర్భాలే చాలా తక్కువ..అలాంటిది మేము విడిపోయాము అనే పుకార్లను ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదు..ఐశ్వర్య రాయ్ నా జీవితం లో తల్లి తర్వాత తల్లి లాంటిది..మేము ఇద్దరం ఎంత ప్రేమించుకుంటున్నామో మాకు మాత్రమే తెలుసు.

దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించొద్దు అంటూ అభిషేక్ బచ్చన్ మాట్లాడాడు..ఇక అభిషేక్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది విడుదలైన దస్వి అనే చిత్రం తర్వాత మళ్ళీ ఆయన ప్రస్తుతం కాళిగానే ఉన్నాడు..ఇక ఐశ్వర్య రాయ్ ఇటీవలే విడుదలైన పొన్నియన్ సెల్వన్ అనే సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లో నందిని అనే పాత్ర పోషించి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..కేవలం మూడు రోజుల్లోనే 240 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.
Also Read:Sarfaraz Khan: బ్రాడమన్ నే మించిపోయిన యువ ఇండియన్ క్రికెటర్. కానీ వినోద్ కాంబ్లీ రికార్డ్ పదిలం.
[…] Also Read: Abhishek Bachchan- Aishwarya Rai: అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య… […]