https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ఎలిమినేట్ అయిన అభయ్..నోటి దూలతో రెమ్యూనరేషన్ కూడా పోగొట్టుకున్నాడుగా!

అతను స్నేహం చేసే వాళ్ళు అవతల టీం లో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు టాస్కులలో సహాయం చేస్తాడు. ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడు అంత లిస్ట్ వస్తాది. ఒక కంటెస్టెంట్ ఎలా ఉండకూడదు రాబోయే సీజన్స్ లో కూడా అభయ్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఇతన్ని మించిన పాపులర్ సెలెబ్రిటీలు కూడా వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా బిగ్ బాస్ మీద నోరు పారేసుకోలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : September 22, 2024 / 09:40 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు వెర్షన్ లో 7 సీజన్స్ పూర్తి అయ్యాయి, ఇప్పుడు 8 వ సీజన్ నడుస్తుంది. ఇన్ని సీజన్స్ లో అతి చెత్త కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది అభయ్ అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో ఇతను ఎదో పీకేస్తాడు, పొడిచేస్తాడు అని ఆడియన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. కానీ మొదటి ఎపిసోడ్ నుండే ఇతను నిరాశపరుస్తూ వచ్చాడు. టాస్కులు సీరియస్ గా ఆడడు, కేవలం అతని గ్రూప్ కి సంబంధించిన వాళ్లకు చాలా పక్షపాతం చూపిస్తాడు. అతను స్నేహం చేసే వాళ్ళు అవతల టీం లో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు టాస్కులలో సహాయం చేస్తాడు. ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడు అంత లిస్ట్ వస్తాది. ఒక కంటెస్టెంట్ ఎలా ఉండకూడదు రాబోయే సీజన్స్ లో కూడా అభయ్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఇతన్ని మించిన పాపులర్ సెలెబ్రిటీలు కూడా వచ్చారు. కానీ ఎవ్వరూ కూడా బిగ్ బాస్ మీద నోరు పారేసుకోలేదు.

    హౌస్ లో ఎలాంటి సందర్భం వచ్చినా చాలా స్థిరంగా ఉన్నారు. వాళ్లంతా రోజుకి లక్ష రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కంటెస్టెంట్స్. అలాంటిది ఇతను ఎవరో కూడా నూటికి 90 శాతం మంది ప్రేక్షకులకు తెలియదు, బిగ్ బాస్ మీద సెటైర్లు వేయడం, నోటికి వచ్చినట్టు తిట్టడం తప్పు అని తెలిసి కూడా ఇన్ని కామెంట్స్ చేసాడంటే ఇతనిలో ఎంత బలుపు ఉండాలి మీరే ఆలోచించండి. నాగార్జున ఒక కంటెస్టెంట్ ని సైకో అని తిట్టడం కానీ, అసలు నువ్వు మనిషివేనా అని కామెంట్స్ చేయడం కానీ ఇప్పటి వరకు చేయలేదు. అలాంటిది అభయ్ మీద చేసాడంటే అతను ఎంత దరిద్రంగా కంటెస్టెంట్ అనేది అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ ని తిట్టడమే కాకుండా, బిగ్ బాస్ భార్య మీద కామెంట్స్ చేసాడు. ఏమి టాస్కులు ఇవి, చిన్న పిల్లోడు డిజైన్ చేసినట్టు ఉన్నాయి, నన్ను బయటకి పంపించు, ఎలాంటి టాస్కులు రాస్తానో చూడు అంటూ బిగ్ బాస్ ని అవహేళన కూడా చేసాడు.

    పాపులారిటీ ఇస్తూ, రెమ్యూనరేషన్ ని ఇస్తూ నీకు ఒక్క స్థాయిని కల్పించే బిగ్గెస్ట్ రియాలిటీ షో పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు మనిషి తత్త్వం అనిపించుకుంటుందా?, అంతే కాదు బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్ వెంటనే ఇవ్వరు. ఒక్కోసారి 9 నెలలు కూడా పట్టొచ్చు, ఏమైనా తేడా చేస్తే రెమ్యూనరేషన్ కూడా రాదు అనే విషయం తెలిసి కూడా అభయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసాడంటే అతనిపై బిగ్ బాస్ టీం పరువు నష్టం దావా కేసు వేసినా తప్పు లేదు అని చెప్పొచ్చు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అభయ్ కి రెమ్యూనరేషన్ బిగ్ బాస్ టీం ఇచ్చేందుకు నిరాకరించిందట, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో చూడాలి.