Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. ఆసక్తికరమైన టాస్కులతో పాటు మధ్యలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు హౌస్ ని హీట్ వాతావరణంలోకి నెట్టేసింది. నిన్న చీఫ్స్ గా వ్యవహరిస్తున్న నిఖిల్, యష్మీ మరియు నైనికా తమ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. యష్మీ మరియు నైనికా టీం లో చెరో నలుగురు ఉండగా, నిఖిల్ టీం లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా యష్మీ మరియు నైనికా టీమ్స్ మధ్య కొన్ని టాస్కులు పెట్టి, వీరిలో గెలిచిన టీం కి నిఖిల్ టీం నుండి ఒకరిని లాక్కునే అవకాశం కల్పించాడు. సమతూల్యం చేసి నిఖిల్ టీం కి న్యాయం చెయ్యాల్సిన బిగ్ బాస్ ఇలా అతని టీం ని మరింత కుదించేలా చేయడం హౌస్ లో అందరినీ షాక్ కి గురి చేసింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన టాస్కులలో లూప్ ది హోల్స్ గేమ్ లో నైనికా టీం గెలవగా, బ్రిక్స్ గేమ్ లో యష్మీ టీం గెలుపొందింది. మరోవైపు వంట గదిలో ఉన్నటువంటి టీం ప్రతీ విషయం లోను గొడవలు పడుతూనే ఉన్నారు.
ఎవరి గిన్నెలు వాళ్ళే కడుక్కోవాలి అంటూ సీత చెప్తుంది. దీనికి కోపగించుకున్న అభయ్ నువ్వు నా క్రింద పనిచేయడం లేదు, ఇది కేవలం గేమ్ మాత్రమే అని అరుస్తాడు. అందరి గిన్నెలు మేమెందుకు కడగాలి అని సీత నిలదీసే ప్రయత్నం చేయగా, ఈ మాట అనేందుకు నీకు బుర్ర ఉండాలి అంటూ అభయ్ మండిపడ్డాడు. దీనికి సీత వెక్కిళ్లు పెట్టి ఏడ్చేస్తుంది. వంటగదిలో ఎల్లప్పుడూ గిన్నెలు కడుగుతూ ఉంటే ఇక నేను గేమ్ ఎప్పుడూ ఆడాలి అంటూ విష్ణు ప్రియా కి చెప్పుకుంటూ బాధపడుతుంది సీత. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇలా ఎక్కువగా వంట గదికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఈ సీజన్ లో రేషన్ ఉండదు, ఎవరి రేషన్ ని వారు టాస్కులలో గెలిచి సంపాదించుకోవాలి. రేషన్ విషయం లో అజాగ్రత్తగా వ్యవహరించినందుకు అందరితో స్నేహంగా ఉన్నప్పటికీ కూడా బెజవాడ బేబక్క కి అత్యధిక నామినేషన్స్ వచ్చాయి.
ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో ఆమె కూడా ఉంది. అయితే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో అందరికంటే అత్యధిక ఓట్లతో యాంకర్ విష్ణు ప్రియా కొనసాగుతుంది. ఆమె తర్వాత స్వల్ప ఓట్ల తేడాతో నాగ మణికంఠ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. నామినేషన్స్ లో ఉన్న మరో కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా తన గ్రాఫ్ ని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాడు. అంతే కాకుండా ఈ వారం మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి.