Abbas: సంచలన డైరెక్టర్ శంకర్ సినిమాలు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో.. అంత అడ్వాన్స్ గా ఉంటాయి. అందుకే ఆయన సినిమా చేద్దామంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా చేసినా స్టార్ డమ్ పెరుగుతుందని భావిస్తుంటారు సినీ హీరోలు. అయితే ఆయన డైరెక్షన్ లో జీన్స్ సినిమాను తీద్దామను కున్నాడు. ఒకే పోలికలు ఉన్న ఇద్దరు కుర్రాళ్లు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో అద్భుతంగా తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమాను ముందుగా హీరో అబ్బాస్‌తో చేద్దామని శంకర్ అనుకున్నారంట. ఆయన అయితే బాగుంటుందని సీన్ చెప్దామని శంకర్ అనుకున్నారంట. కాగా అప్పటికే ప్రేమదేశం సినిమా పెద్ద హిట్ కావడంతో అబ్బాస్ బాగా బిజీగా అయిపోయాడంట. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఏకంగా పది సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడంట.
Also Read: మహేష్ కి ఆమె పై అంత ప్రేమ ఉందా ?
కాగా అదే సమయంలో శంకర్ పిలిచి అడగ్గా.. తాను ఆల్రెడీ సినిమాలకు ఓకే చెప్పేయడంతో.. ఈ సినిమాను చేయడానికి డేట్లు సరిపోక చివరకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందంట. అయితే ఇదే కథను అజిత్‌కు వినిపించాడంట శంకర్. కానీ డేట్లు అడ్జస్ట్ కాక అజిత్ కూడా తప్పుకున్నాడంట. ఇక ఆఖరకు ప్రశాంత్ ను అడిగాడంట శంకర్.

అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం లాంటి బంపర్ హిట్ మూవీలను కాదనుకుని బాధపడుతున్నాడు ప్రశాంత్. దీంతో శంకర్ రూపంలో వచ్చిన అదృష్టాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అయితే ప్రశాంత్ కూడా అప్పటికే ఏడు సినిమాలను లైన్లో పెట్టుకున్నా సరే.. వాటన్నింటినీ పక్కన పెట్టేసి శంకర్ మూవీకి ఓకే చెప్పాడు. దీంతో ఐశ్వర్య రాయ్‌ను హీరోయిన్ గా పెట్టి ఈ మూవీని తీశాడు శంకర్.
అయితే విడుదలయ్యాక దీని రిజల్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఇదో విజువల్ వండర్ లా అనిపించింది. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అబ్బాస్ చాలా ఫీల్ అయ్యారంట. అనవసరంగా బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నానని సన్నిహితుల దగ్గర వాపోయారంట.
Also Read: ఇంట్లో తాబేలు బొమ్మ ఉండవచ్చా.. ఉంటే ఏ దిశలో పెట్టాలి?
[…] Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు మాట్లాడారు. సీఎం జగన్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హీరోలకు అభయం ఇచ్చాడు. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చిరు అండ్ టీం ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. […]
[…] Bollywood Trends: బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తనకు, అక్షయ్ కుమార్‌కి మధ్య విభేదాలు తొలగిపోయాయని ప్రముఖ కమెడియన్, యాంకర్ కపిల్ శర్మ అన్నాడు. ‘అక్షయ్‌కు, నాకు మధ్య విభేదాలు వచ్చాయంటూ మీడియాలో వస్తోన్న వార్తలు చూశా. ఇప్పుడే నేను అక్షయ్‌తో మాట్లాడాను. సమాచార లోపంతోనే మా మధ్య అపార్థాలు తలెత్తాయి. నేను ఫోన్ చేసి మాట్లాడటంతో ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. అక్షయ్ నాకు ఎప్పటికీ పెద్దన్న లాంటివారు. ఆయనకు నాపై ఎలాంటి కోపం లేదు’ అని కపిల్ అన్నాడు. […]