Abbas: అమ్మాయిల కలల రాకుమారుడు ఎలా ఉండాలంటే ఒకప్పుడు అబ్బాస్ ను చూపించేవారు. పురుషుల్లో అందమైన హీరోల్లో అబ్బాస్ ఒకరు. ఈయనలా ఉండాలని కొందరు యువకులు అబ్బాస్ కటింగ్ పేరుతో అప్పట్లో సందడి చేశారు. కొన్ని హెయిన్ సెలూన్లు సైతం ఇక్కడ అబ్బాస్ కటింగ్ చేయబడును అని బోర్డులు కూడా పెట్టారు. అలా కొన్ని రోజుల పాటు హవా సాగించిన అబ్బాస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. సినిమాల్లో హీరోగ కొనసాగిన ఆయన చివరికి కారు డ్రైవర్ గా.. మెకానిక్ గా మారిపోయాడట. అంతటి దారుణ పరిస్థితుల్లో అబ్బాస్ ఏం చేశాడో తెలుసా?
కుర్రాళ్ల గుండెల్లో మంట్ట పుట్టించిన ‘ప్రేమ దేశం’ సినిమాను ఎవరూ మరిచిపోరు. కాలేజ్ యూత్ అండ్ లవ్ స్టోరీ నేపథ్యంలో 1996లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. అయితే ఈ మూవీతో అబ్బాస్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత మిగతా వారికి పోటీ ఇస్తారని అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారైంది. అబ్బాస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రేమ దేశం సినిమా తరువాత అబ్బాస్ కు అవకాశాలు సరిగ్గా రాలేదు.కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోగా నటించినా రాణించలేదు. దీంతో సైడ్ హీరోగా, సైడ్ పాత్రల్లో నటిస్తూ వచ్చారు.
అయితే సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా కుంగిపోయిన అబ్బాస్ ఇండియాలో ఉండి ఏ జాబ్ చేయలేక న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ బతుకు దెరువు కోసం కారు డ్రైవర్ గా పనిచేశాడు. అయినా డబ్బుులు సరిపోకపోవడంతో మెకానిక్ గా పనిచేశాడు. ముఖ్యంగా కరోనా సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ తీవ్రంగా ఆలోచించి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తరువాత అబ్బాస్ జీవితం సాధారణ స్థితికి వచ్చింది.
ఇటీవల అబ్బాస్ లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టాడు. ఇందులో పూర్తిగా మారిపోయిన అబ్బాస్ కనిపిస్తున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లైఫ్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి ఆయన కౌన్సెలింగ్ ఇస్తున్నాడు. జీవితంలో ఎంతో సాధించాలని, ఇంత మాత్రాందానికి ఆత్మహత్య చేసుకోవడం మహా పాపమని అబ్బాస్ ఆ ఇంటర్వ్యూలో చెబుతున్నాడు.