Aamir Khan: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్…ఎలా బయటపడ్డాడంటే.. ఫొటోలు వైరల్..

అమీర్ ఖాన్ స్టే చేసిన కరపాక్కం ఏరియా నీటితో మునిగిపోయింది. నివాస సముదాయాల్లోకి నీరు వెళ్లాయి. అమీర్ ఖాన్ వరదల్లో చిక్కుకున్న విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ మూడు బోట్లతో అక్కడికి చేరుకున్నారు.

Written By: NARESH, Updated On : December 6, 2023 11:37 am

Aamir Khan

Follow us on

Aamir Khan: వరదలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీటి స్థాయి ప్రమాదకర స్థాయికి చేరింది. గత రెండు రోజులుగా వరదలో చిక్కుకుని ప్రజానికం అల్లాడుతున్నారు. వరద కష్టాలు సెలెబ్రిటీలకు కూడా తప్పడం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చెన్నై వరదలతో ఇక్కట్ల పాలయ్యారు. ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చెన్నై వచ్చిన అమీర్ ఖాన్ ని వరదలు బయపెట్టాయి.

అమీర్ ఖాన్ స్టే చేసిన కరపాక్కం ఏరియా నీటితో మునిగిపోయింది. నివాస సముదాయాల్లోకి నీరు వెళ్లాయి. అమీర్ ఖాన్ వరదల్లో చిక్కుకున్న విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ మూడు బోట్లతో అక్కడికి చేరుకున్నారు. అమీర్ ఖాన్ తో పాటు హీరో విష్ణు విశాల్ ని కాపాడారు. ఈ విషయం తెలియజేస్తూ విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. కరపాక్కం ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న తమను సిబ్బంది కాపాడినట్లు వెల్లడించారు. కష్ట సమయాల్లో ఆదుకున్న తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

అమీర్ ఖాన్ సురక్షితంగా వరద ముప్పు నుండి బయటపడినందుకు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సంతోషాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరో పోస్ట్ లో విష్ణు విశాల్… వరద బీభత్సం ఈ స్థాయిలో ఉందో తెలియజేశాడు. ఆయన ఇంటి పరిసరాలు నీటితో మునిగిపోయాయి. పవర్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదు, నెట్వర్క్ లేదు. ఇంటి పైకి వస్తే కొంచెం సిగ్నల్ లభించింది.. అంటూ ఓ పోస్ట్ పెట్టారు.

విష్ణు విశాల్ పోస్ట్స్ చెన్నైలో వరద పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు. కొన్నేళ్లుగా చెన్నై నగరం దారుణ పరిస్థితులు చవి చూస్తుంది. చిన్న వర్షాలకు కూడా నగరం మునిగిపోతుంది. మరోవైపు విష్ణు విశాల్ నెక్స్ట్ లాల్ సలామ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. ఈ మూవీలో రజినీకాంత్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.