Aamir Khan Sitare Zameen Par: కొన్ని సినిమాలు మనల్ని చాలా సర్ప్రైజ్ కి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే విడుదలకు ముందు ఆ సినిమాలపై ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ విడుదల తర్వాత ఎవ్వరూ ఊహించని అద్భుతాలను బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తూ ఉంటాయి. రీసెంట్ గా విడుదలైన అమీర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) చిత్రం అందుకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 2007 వ సంవత్సరం లో అమీర్ ఖాన్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది సీక్వెల్. విడుదలకు ముందు ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది కానీ, ఇలాంటి సున్నితమైన సినిమాలకు క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ రావొచ్చు కానీ, కమర్షియల్ గా కలెక్షన్స్ రావడం మాత్రం కష్టమని అంతా అనుకున్నారు. కానీ అమీర్ ఖాన్ స్టార్ పవర్ అందరి అంచనాలను తలక్రిందులు చేసింది.
మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రం భారీ వీకెండ్ తో పాటు, వర్కింగ్ డేస్ లో స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. 6 రోజుల్లో ఇండియా వైడ్ గా 81 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి మొదటి వారం 88 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తుందని, రెండవ వారం లో వంద కోట్ల రూపాయిల మార్కుని దాటుతుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అయితే రేపు బాలీవుడ్ లో ఈ చిత్రం రెండు మూడు కొత్త సినిమాలను ఎదురుకోవాల్సి ఉంటుంది. కాస్త కలెక్షన్స్ పై ప్రభావం పడొచ్చు. కానీ అర్బన్ సెంటర్స్ లో అద్భుతమైన థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమాకు లాంగ్ రన్ మాత్రం ఇంతే స్టడీ గా ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. అయితే ఆరు రోజులకు కలిపి రోజువారీగా ఈ సినిమాకు ఎంత నెట్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read: NTR: ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…
మొదటి రోజు 10.70 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 19.90 కోట్లు, మూడవ రోజు 26.70 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక వర్కింగ్ డేస్ మొదలయ్యాక నాల్గవ రోజున 8 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, 5వ రోజున 8 కోట్ల 60 లక్షలు,ఆరవ రోజు 7 కోట్ల 51 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఎవ్వరూ ఊహించని థియేట్రికల్ రన్ వస్తుంది. కేవలం ఆరు రోజుల్లోనే 38 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ వీకెండ్ తో 60 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశం ఉంది. అలా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చెయ్యని ఈ చిత్రం విడుదల తర్వాత ఈ రేంజ్ రన్ ని సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.