https://oktelugu.com/

12 సినిమాలు ప్లాప్ లు.. అయినా ఛాన్స్ లు !

ప్లాప్ వస్తే.. ఇక ఆ హీరోకి మరో సినిమా రావాలంటే.. చాల కష్టం. అలాంటిది ఒక చిన్న హీరోకి, పైగా పెద్దగా హిట్ కూడా లేని హీరోకి వరుసగా సినిమాలు వస్తున్నాయంటే.. నిజంగా విశేషమే. అసలు ఒక హీరో వరుసగా రెండు, మూడు ఫ్లాపులు ఇస్తేనే.. నిర్మాతలు ముఖం చాటేయ్యడం అనేది ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోలకే అనుభవంలోకి వస్తోంది. కానీ యంగ్ హీరో ఆది మాత్రం డజన్ ఫ్లాపులు అందుకుని కూడా, ఇంకా […]

Written By:
  • admin
  • , Updated On : March 22, 2021 / 03:51 PM IST
    Follow us on


    ప్లాప్ వస్తే.. ఇక ఆ హీరోకి మరో సినిమా రావాలంటే.. చాల కష్టం. అలాంటిది ఒక చిన్న హీరోకి, పైగా పెద్దగా హిట్ కూడా లేని హీరోకి వరుసగా సినిమాలు వస్తున్నాయంటే.. నిజంగా విశేషమే. అసలు ఒక హీరో వరుసగా రెండు, మూడు ఫ్లాపులు ఇస్తేనే.. నిర్మాతలు ముఖం చాటేయ్యడం అనేది ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోలకే అనుభవంలోకి వస్తోంది. కానీ యంగ్ హీరో ఆది మాత్రం డజన్ ఫ్లాపులు అందుకుని కూడా, ఇంకా హీరోగానే కొనసాగుతున్నాడు.

    ఆది సాయికుమార్ ఇప్పటివరకు 14 సినిమాల్లో నటించాడు. అయితే, ఆ 14 సినిమాల్లో దాదాపు 12 సినిమాలు ప్లాప్స్ గానే మిగిలాయి. గత వీకెండ్ ‘శశి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్ అవుతుందని.. ఆది చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. ఎంత డిజాస్టర్ అంటే.. ఈ సినిమా మూడు రోజులకు గానూ 30 లక్షలు కూడా కలెక్ట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. ఈ సినిమాలో ఒక పాట బాగా వైరల్ అయింది కూడా.

    సాంగ్ వైరల్ అయితేనే, ఆది సాయికుమార్ సినిమాకి వచ్చే ఓపెనింగ్ ముప్పై లక్షలకు మించి లేవు అంటే.. ఇక ఆది మార్కెట్ రేంజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఆది సాయి కుమార్ హీరోగా అంటే థియేటర్ వైపు కూడా జనం ముఖం చూపించరు అనే ట్యాగ్ లైన్ ఆల్ రెడీ ఆదికి పడిపోయింది. మరి ఆది హీరోగా ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడో ? ఏది ఏమైనా ‘శశి’ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి కూడా ఆది హీరోగా మరో సినిమాని అనౌన్స్ చేశారు కొత్త నిర్మాతలు. మరి ఈ సినిమా ఏమవుతుందో చూద్దాం.