https://oktelugu.com/

బట్టలన్నీ విప్పమన్న దర్శకుడు ఎవరో ?

బాలీవుడ్ బ్యూటీ ‘ప్రియాంక చోప్రా’ ఈ మధ్య తన కెరీర్ లో జరిగిన కొన్ని చేదు సంఘటనలను సగర్వంగా ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ ను ఆమె బయట పెట్టింది. తానూ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో .. ఒక దర్శకుడు అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ తీసేయమని ఆమెను కోరాడాట. బహుశా సాంగ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ దర్శకుడు తనను అలా కోరాడు అని మొదట అనుకున్నా.. […]

Written By:
  • admin
  • , Updated On : March 22, 2021 / 04:04 PM IST
    Follow us on


    బాలీవుడ్ బ్యూటీ ‘ప్రియాంక చోప్రా’ ఈ మధ్య తన కెరీర్ లో జరిగిన కొన్ని చేదు సంఘటనలను సగర్వంగా ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ ను ఆమె బయట పెట్టింది. తానూ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో .. ఒక దర్శకుడు అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ తీసేయమని ఆమెను కోరాడాట. బహుశా సాంగ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ దర్శకుడు తనను అలా కోరాడు అని మొదట అనుకున్నా.. ఆ తరువాత ఆ దర్శకుడు ఆమె వైపు చూసిన చూపులను బట్టి ఆమెకు అసలు విషయం తెలిసిందట.

    Also Read: రోజాతో విభేదాలపై నాగబాబు షాకింగ్‌ రియాక్షన్‌

    బట్టలన్నీ విప్పేసి డ్యాన్స్ చెయ్యమని ఆ దర్శకుడు తనను బలవంతం పెట్టాడని ప్రియాంక చెప్పుకొచ్చింది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె తన ఆత్మకథని రాస్తూ ఇలాంటి విషయాలను చెబుతూ కుర్రాళ్లకి మంచి కాలక్షేపాన్ని ఇస్తోంది. ఆ బుక్ ప్రచారంలో భాగంగా ఫేమస్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ ఫ్రె షోలో పాల్గొంది ప్రియాంక చోప్రా. ఆమె ఇంటర్వ్యూలో బుక్ లోని ఇలాంటి బోల్డ్ విషయాలని అంతే బోల్డ్ గా తెలిపింది ప్రియాంక.

    Also Read: కీర్తి సురేశ్ మహానటి కాదు.. మహానాటు అట

    ఈ విషయాన్ని ప్రియాంక మాటల్లో వింటే.. “ఆ దర్శకుడి కోరిక విన్నాక, వెంటనే నేను ఆ సినిమా వదిలేశాను. కాకపోతే, అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్త. ఆ దర్శకుడు గురించి బయటకి చెప్పేంత ధైర్యం అప్పుడు లేదు. ఇలాంటివి అన్ని బయటకి మాట్లాడితే… ఆమెతో వర్క్ చెయ్యడం కష్టం అనే ముద్ర వేస్తారని నా కొలీగ్స్ చెప్పడంతో అప్పుడు మీడియాకి తెలపలేదు,” అని ప్రియాంక చోప్రా చెప్పింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఆమె తన బుక్ లో రాసిందట. మరి చూద్దాం ఆ దర్శకుడు ఎవరో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్