Aadhi Pinisetty: నటుడు ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. మే 18న జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. హీరో నాని, సందీప్ కిషన్ ఆదికి అత్యంత సన్నిహితులు కాగా వేడుకలో మెరిశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఆది ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకు అన్న విషయం తెలిసిందే. ఇది ప్రేమ వివాహం అయినప్పటికీ ఆది తన భార్య వద్ద కోట్లు కట్నంగా తీసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది.

కోరి కట్టుకున్న ప్రియుడైనప్పటికీ నిక్కీ భర్తకు కట్నం రూపంలో కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్. మరి కట్నం చట్ట విరుద్ధం కాబట్టి… తీసుకున్నట్లు ఎవరూ వెల్లడించరు. కానుకల వివరాలు మాత్రమే బయటపెడతారు. దీంతో కచ్చితంగా ఎంత విలువైన కట్నం తీసుకున్నాడనే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు ఆది పినిశెట్టి హీరోగా చేస్తూనే విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా క్లాప్ అనే స్పోర్ట్స్ డ్రామా విడుదలైంది. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.
Also Read: Mahesh Babu- Trivikram Movie: షూటింగ్ ప్రారంభం కాకముందే 300 కోట్లు.. ఆల్ టైం రికార్డ్
అలాగే గుడ్ లక్ సఖి మూవీలో కీర్తి సురేష్ పక్కన సపోర్టింగ్ రోల్ చేశాడు. సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో ఆది విలన్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం మూవీలో చరణ్ అన్నగా ఆయన మంచి పాత్ర దక్కించుకున్నారు. ఆ మూవీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న బై లింగ్వల్ మూవీ వారియర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. వారియర్ మూవీలో ఆది విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఎక్కువగా చిత్రాలు చేసిన నిక్కీ గల్రాని… తెలుగులో సునీల్ కి జంటగా కృష్ణాష్టమి మూవీ చేశారు. ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. తెలుగులో మరలా ఆమెకు ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తారో లేదో చూడాలి. ఆది-నిక్కీ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు ఉన్నారు. ఈ నవ దంపతులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
Also Read:Chakravakam: చక్రవాకం నటులు ఏం చేస్తున్నారో తెలుసా?
[…] Also Read: Aadhi Pinisetty: హాట్ టాపిక్ గా నటుడు ఆది వరకట్న… […]