Allu Arjun: ‘పుష్ప 2 ‘ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది కేవలం ఆయన అభిమానుల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. పీక్ రేంజ్ పెర్ఫార్మన్స్ చూపించిన తర్వాత అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ఖాన్స్ తో సమానమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా మాస్ ప్రాంతాల్లో అల్లు అర్జున్ పేరు చెప్తే పూనకలొచ్చి ఊగిపోతున్నారు. అంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ఆయన. ఈ క్రేజ్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కాంబినేషన్స్ ని నమ్ముకోకుండా, కేవలం స్క్రిప్ట్ మీద మాత్రమే నమ్మకం పెట్టాలి. అదే విధంగా క్యారక్టర్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా అంతటి ప్రజాధారణ పొందడానికి కారణం ఆ సినిమా కంటెంట్ వల్ల కాదు, అల్లు అర్జున్ పాత్ర వల్ల. అంతలా జీవించేసాడు ఆయన. మూడు గంటల 40 నిమిషాల నిడివి ఉన్న సినిమాకి జనాలు క్యూలు కట్టారంటే అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ అందుకు కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అందుకే అల్లు అర్జున్ ఎక్కువగా క్యారక్టర్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘పుష్ప 2 ‘ తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ప్రాంతీయ బాషా చిత్రాలు మాత్రమే తీస్తాడు, ఆయన నుండి పాన్ ఇండియన్ సబ్జెక్టులు రావడం కష్టమే, త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ ఇప్పుడు ఉన్న రేంజ్ లో సినిమా తీయడం కరెక్ట్ ఛాయస్ కాదు అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీయబోయేది చిన్న సినిమా కాదు, 500 కోట్ల రూపాయిల ప్రాజెక్ట్. ఈ సినిమా మహాదేవుడు శివ పార్వతుల కుమారుడు సుబ్రమణ్య స్వామి తన తల్లితండ్రుల వద్దకు చేరుకునే ఒక సంఘటనని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ కి మన పురాణాల మీద ఎంత పట్టు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఆ సబ్జెక్టు గురించి మాట్లాడుతుంటే ఎవరైనా అలా వింటూ ఉండిపోతారు. అంతటి జ్ఞానం ఉంది ఆయనకు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘కల్కి’ చిత్రం లో మహాభారతం కి సంబంధించిన 10 నిమిషాల సన్నివేశాలకు ఆడియన్స్ మెంటలెక్కిపోయారు. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని ఆ చిత్రానికి అందించారు. అంత క్రేజ్ ఉంది ఈ జానర్ కి. అలాంటిది పూర్తి స్థాయిలో సినిమా తీస్తే , అది కూడా అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ తో, ఆకాశమే హద్దు అనుకోవాలి. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కి సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది. ఉగాది పర్వదినాన ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.