Pushpa 2 Movie : దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ‘పుష్ప 2 : ది రూల్’ మేనియా నే కనిపిస్తుంది. టికెట్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు టిక్కెట్ల కోసం పడుతున్న ఇక్కట్లను చూస్తుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆన్లైన్ లో 500 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టినా కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే ప్రతీ భాషలోనూ ఈ చిత్రం ఆల్ టైం రికార్డుని నెలకొల్పేలా కనిపిస్తుంది. నిన్న కేవలం హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. అక్షరాలా 24 గంటల్లో 2 లక్షల 50 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. హిందీ వెర్షన్ కి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ చిత్రాలకు మాత్రమే జరిగాయి. జవాన్ చిత్రానికి ఇండియా వైడ్ గా మొదటి రోజు 70 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తే, పుష్ప 2 చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు లో కూడా ఈ చిత్రం ప్రస్తుతం ఆల్ టైం ఓపెనింగ్ రికార్డుగా పిలవబడుతున్న #RRR రికార్డు ని బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. ఇక 3D వెర్షన్ బుకింగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాకముందే, ఈ చిత్రానికి బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో గంటకి 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. దీనిని బట్టి ఈ చిత్రానికి ఏ క్షణంలో అయిన గంటకి లక్ష టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఆన్లైన్ ఈ సినిమా మేనియా ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో పుష్ప చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
యూట్యూబ్ లో ఒక చిన్న పిల్లాడు ‘పుష్ప 2’ ట్రైలర్ కి స్పూఫ్ చేస్తూ అప్లోడ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది. కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే కాదు, యూట్యూబ్ లోకి వెళ్లి పుష్ప 2 ట్రైలర్ స్పూఫ్ అని కొడితే వేల సంఖ్యలో వీడియోలు ప్రత్యక్షమవుతాయి. వాటిల్లో ఈ బుడ్డోడు చేసిన ట్రైలర్ స్పూఫ్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ ట్రైలర్ మూవీ టీం వరకు రీచ్ అయ్యిందట. అల్లు అర్జున్ కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఈ వీడియో ని షేర్ చేసి, స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మేకర్స్.