https://oktelugu.com/

Krishna Fans: ‘హీరో’లో కృష్ణ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

Hero Krishna fans: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సపోర్టుతో గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి అందరికీ తెల్సిందే. ‘హీరో’ మూవీతో జనవరి 15న గల్లా అశోక్ తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతున్నాడు. ఈ మూవీలో అశోక్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 11, 2022 / 12:19 PM IST
    Follow us on

    Hero Krishna fans: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సపోర్టుతో గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సంగతి అందరికీ తెల్సిందే. ‘హీరో’ మూవీతో జనవరి 15న గల్లా అశోక్ తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతున్నాడు. ఈ మూవీలో అశోక్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    Krishna Fans

    సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘హీరో’ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో గల్లా అశోక్ ను కౌబాయ్ గా దర్శకుడు చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు పేర్లు బాగానే విన్పించాయి. ఇక ఈ మూవీలోని తొలి పది నిమిషాలు కృష్ణ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే పోయే ట్రీట్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

    Also Read:  ‘వనమా’ దొరికాడిలా.. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

    కౌబాయ్ సినిమాలకు సూపర్ స్టార్ కృష్ణ పెట్టింది పేరు. ‘మోసగాళ్లకు మోసగాళ్లు’లో కృష్ణ కౌబాయ్ గా నటించి వారెవ్వా అనిపించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్స్ కౌబాయ్ గెటప్పుల్లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నారు. గల్లా అశోక్ తొలి మూవీలోనే దర్శకుడు కౌబాయ్ గా పరిచయం చేయనుండటం ఆసక్తిని రేపుతోంది.

    ఈ మూవీలోనే సూపర్ స్టార్లు కృష్ణ, మహేష్ బాబులు సైతం ఓ సన్నివేశంలో కౌబాయ్ లుగా కన్పించనున్నారట. ఒకేసారి కృష్ణ, మహేష్ బాబు, అశోక్ లు కౌబాయ్ గెటప్పులో ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తారని తెలుస్తోంది. ఈ సీన్ నిజంగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉండనుందట. అయితే ఈ సీన్ ను గ్రాఫిక్స్ లో యాడ్ చేసేలా నిజంగా కృష్ణ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారా? అనేది మాత్రం మూవీలో చూడాల్సిందే..!

    Also Read: అకీరాకి కరోనా పాజిటివ్.. పవన్ సాయం నిరాకరించిన రేణూ దేశాయ్ ! కారణమిదే