Tamil hero Vijay meeting: తమిళనాడు రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా తలపతి విజయ్(thalapathy vijay) ఒక సెన్సేషనల్ టాపిక్. అంతకు ముందు అధికార పార్టీ నాయకులూ కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులూ కూడా విజయ్ ని ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఆయన గురించి పూర్తిగా మాట్లాడడం మానేశారు. కానీ కరూర్ ప్రాంతం లో ఆయన ఏర్పాటు చేసిన మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట కారణం 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నుండి విజయ్ రాజకీయ వర్గాల నుండి హీట్ ని ఎగురుకుంటూ ఉన్నాడు. ఈ అంశంపై ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అదే విధంగా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు . కానీ అత్యధిక శాతం మంది విజయ్ ని ఈ అంశం లో తప్పుబట్టే వాళ్ళే ఎక్కువ. అయితే ఈ ఘటన నుండి నెమ్మదిగా కోలుకొని మళ్లీ జనాల్లోకి వచ్చాడు .
నేడు పుడుచెర్రీ లో ఏర్పాటు చేసిన TVK సభలో ఒక వ్యక్తి తుపాకీ రావడం తో కలకలం రేగింది. పోలీసులు ఆ వ్యక్తిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయడం లో సక్సెస్ అయ్యారు. అరెస్ట్ అయినా వ్యక్తి పేరు డేవిడ్ అట. డేవిడ్ పుడిచెర్రీ TVK పార్టీ కార్యదర్శి ప్రభు కి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు అట. సభా ప్రాంగణం లోకి అడుగుపెట్టే ముందు మెంటల్ డిటెక్టర్ టెస్టులు నిర్వహిస్తారు కదా, అక్కడే ఇతను పోలీసులకు దొరికిపోయాడట. అతన్ని కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగుందా లేదా అనే కోణం లో విచారిస్తున్నారట. ఈ ఘటన తర్వాత పుడిచెర్రీ పోలీసులు కూడా బాగా అల్లర్లు అయ్యారట. విజయ్ సభని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చూసేందుకు కృషి చేస్తున్నారు. చూడాలి మరి ఈ సభ ఎలాంటి వాతావరణం లో జరుగుతుంది అనేది. కానీ విజయ్ ఈ సభలో మాట్లాడే మాటల కోసం కేవలం TVK అభిమానులు మాత్రమే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు.