https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ సినిమా చూసి కన్నీరు మున్నీరైన ఓ స్టార్ హీరో వైఫ్, ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏమిటో తెలుసా?

ప్రభాస్ కి మాస్ హీరోగా పేరుంది. అయితే ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. కాగా ప్రభాస్ నటించిన ఒక చిత్రం చూసిన స్టార్ హీరో వైఫ్ ఏడ్చేసిందట.

Written By:
  • S Reddy
  • , Updated On : November 23, 2024 / 10:38 AM IST

    A star hero's wife who shed tears after watching Prabhas' movie, do you know what that blockbuster movie is?

    Follow us on

    ప్రభాస్ కి మాస్ హీరోగా పేరుంది. అయితే ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా చేశారు. కాగా ప్రభాస్ నటించిన ఒక చిత్రం చూసిన స్టార్ హీరో వైఫ్ ఏడ్చేసిందట. ఆ మూవీ ప్రభాస్ కి మంచి విజయం అందించిందట. ఇంతకీ ఏమిటా చిత్రం? ఎవరా హీరో వైఫ్? ఇంట్రెస్టింగ్ స్టోరీ.. 
     
    ప్రభాస్ ఈశ్వర్ మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. అది యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. అనంతరం రాఘవేంద్ర టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ప్రభాస్ కి ఉన్న కట్ అవుట్ రీత్యా ఆ తరహా సబ్జెక్ట్స్ కి ఆయన సెట్ అయ్యేవారు. కెరీర్ బిగినింగ్ నుండే ప్రభాస్ యాక్షన్ జోనర్స్ ఎంచుకున్నారు. వర్షం మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఈ మూవీలో ఎమోషనల్ లవ్ డ్రామాతో పాటు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ మనం చూడొచ్చు. 
     
    ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. తల్లి సెంటిమెంట్ తో కూడిన ఈ చిత్రం భారీ విజయం అందుకుంది. ప్రభాస్ కి ఎక్కడలేని ఫేమ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ స్టార్ హీరోల జాబితాలో చేరాడు. కాగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని భావించిన ప్రభాస్.. రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా ఎంచుకున్నారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఈ కోవలోకి వస్తాయి. 
     
    ఈ రెండు చిత్రాలు ప్రభాస్ కి అటు అమ్మాయిల్లో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. మహేష్ అనంతరం ప్రభాస్ అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఈ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. కాగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ చూసిన ఓ స్టార్ హీరో వైఫ్ కన్నీరు పెట్టుకుందట. ఆమె ఎవరో కాదు అల్లు స్నేహారెడ్డి. మిస్టర్ పర్ఫెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. కథకు ఎమోషన్స్ బలం. 
     
    ఈ మూవీ ప్రభాస్ ని టెన్షన్ కి గురి చేసిందట. మాస్ హీరో ఇమేజ్ ఉన్న తనకు మిస్టర్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందా? ఆడియన్స్ అంగీకరిస్తారా? లేదా అనే సందేహం వెంటాడిందట. టాలీవుడ్ సెలెబ్స్ కొరకు ప్రీమియర్ షో వేశారు. ఆ షోకి ప్రభాస్ హాజరు కాలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ ప్రీమియర్ షో చూసిన ప్రముఖుల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రభాస్ తో ఉన్న అనుబంధం రీత్యా ఆయన సతీసమేతంగా వెళ్ళాడట. 
     
    మూవీ చూసి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ఫోన్ చేసి ప్రభాస్ తో మాట్లాడాడట. సినిమా చాలా బాగుంది. నాకు నచ్చింది అన్నాడట. మీ వైఫ్ కి మూవీ నచ్చిందా? అని ప్రభాస్ అడిగాడట. స్నేహకు సినిమా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో అయితే ఏడ్చేసిందని అల్లు అర్జున్ చెప్పాడట. లేడీస్ కి కనెక్ట్ అయితే మిస్టర్ పర్ఫెక్ట్ హిట్ అని భావించిన ప్రభాస్.. అల్లు అర్జున్ భార్యకు నచ్చిందా లేదా అని అడిగి తెలుసుకున్నాడట. అల్లు అర్జున్ మాటలతో ప్రభాస్ కి కాన్ఫిడెన్స్ పెరిగిందట. అల్లు అర్జున్ చెప్పినట్లే మిస్టర్ పర్ఫెక్ట్ మంచి విజయం నమోదు చేసింది.