RRR Theatrical Trailer : మన టాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రతిష్టని మాత్రమే కాదు, మన ఇండియన్ సినీ పరిశ్రమ ప్రతిష్టని పెంచిన చిత్రం #RRR. ఆస్కార్ అవార్డు మన ఇండియన్ సినిమాకి వస్తే చూడాలని ఎంతో మందికి కోరిక ఉండేది. కానీ ఆ కోరికని నెరవేర్చి ప్రపంచం మొత్తం మన టాలీవుడ్ వైపు చూసేలా చేసిన చిత్రమిది. డైరెక్టర్ రాజమౌళి తన ప్రతీ సినిమాతో ఇలాంటి అద్భుతాలను సృష్టించడం ఆయనకీ అలవాటుగా మారిపోయింది. కానీ ఇంతకు ముందు ఆయన ప్రభంజనం కేవలం నేషనల్ లెవెల్లో మాత్రమే ఉండేది. కానీ #RRR తో అంతర్జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించాడు. జపాన్ వంటి దేశం లో సంవత్సరం పాటు థియేటర్స్ లో ఆడిన మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇదే. అంతే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో చైనా దేశం కూడా ఉంది.
ఇలాంటి అద్భుతాన్ని ఎలా తెరకెక్కించాడు, దాని వెనుక ఎంత కష్టం ఉంది, ఎలాంటి టెక్నిక్స్ ని ఉపయోగించారు?, ఎంతమంది కష్టపడ్డారు వంటివి తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. అందుకే మూవీ టీం ఒక డాక్యుమెంటరీ ని ఈ నెల 20వ తారీఖున కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఇందులో ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్, అలియా భట్, కీరవాణి, కార్తికేయ ఇలా ప్రతీ ఒక్కరు తమ అనుభవాన్ని పంచుకున్నారు. సుమారుగా గంటకు పైగా ఈ డాక్యుమెంటరీ ఉంటుందట. మొట్టమొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై డాక్యుమెంటరీ చిత్రం థియేటర్స్ విడుదల అవ్వడం అనేది ఈ చిత్రానికే ఇటీవల కాలం లో జరిగింది. ఆ విధంగా సరికొత్త ట్రెండ్ ని కూడా నెలకొల్పింది ఈ చిత్రం. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ముఖ్యంగా ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత సహజంగా, రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ లో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలోనే కాదు, హాలీవుడ్ లో కూడా ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరూ తెరకెక్కించలేదు. అందుకే అవతార్ సిరీస్ ని తీసిన జేమ్స్ కెమెరాన్ స్థాయి వ్యక్తి కూడా రాజమౌళి పనితీరు కి సెల్యూట్ చేసాడు. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ లో క్రూర జంతువులతో ట్రక్ నుండి దూకే సన్నివేశం కూడా హాలీవుడ్ ఆడియన్స్ ని మైమరచిపోయేలా చేసింది. ఇవన్నీ రాజమౌళి ఎలా తీసాడు?, దాని వెనుక ఎంత కష్టపడ్డాడు?, అసలు ఇలాంటి ఆలోచన ఆయనకీ ఎలా వచ్చింది వంటి విశేషాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ఫిలిం స్కూల్స్ లో దర్శకత్వం నేర్చుకునేవాళ్లకు ఈ డాక్యుమెంటరీ ని చూపించొచ్చు, ఆ రేంజ్ లో ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయి.
