https://oktelugu.com/

Bigg Boss 8 : ‘బిగ్ బాస్ 8 ‘ లో సరికొత్త ప్రయోగం..ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో నామినేషన్స్.. ఈ వారం గొడవలు వేరే లెవెల్ !

ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ప్రయోగాలు చాలానే చేసారు. ముఖ్యంగా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీలు గా హౌస్ లోపలకు పంపడం బిగ్ బాస్ టీం తీసుకున్న గొప్ప నిర్ణయం.

Written By:
  • Vicky
  • , Updated On : November 16, 2024 / 05:04 PM IST

    A new experiment in 'Bigg Boss 8'..Nominations with eliminated contestants..This week's fights are on a different level!

    Follow us on

    Bigg Boss 8 : ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ప్రయోగాలు చాలానే చేసారు. ముఖ్యంగా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీలు గా హౌస్ లోపలకు పంపడం బిగ్ బాస్ టీం తీసుకున్న గొప్ప నిర్ణయం. అప్పటి వరకు ఒక మోస్తరుగా వెళ్తున్న ఈ షో, వీళ్ళ రాకతో వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా గౌతమ్, అవినాష్, రోహిణి వంటి వారు భారీ టీఆర్ఫీ రేటింగ్స్ రావడానికి కారణం అయ్యారు. అలా బిగ్ బాస్ తీసుకున్న వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల కాన్సెప్ట్ ఈ సీజన్ కి ఒక రేంజ్ లో కలిసొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ టీం మరో సరికొత్త ప్రయోగంతో మన ముందుకు రాబోతున్నాడు. మొదటి వారం నుండి 11 వ వారం వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలకు పంపించి నామినేషన్స్ ప్రక్రియ చేయించబోతున్నారట. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లోనే కాదు, ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని భాషలకు సంబంధించిన సీజన్స్ లో కూడా ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకు జరగలేదు.

    ఇది క్లిక్ అయితే, ఇతర భాషల్లో బిగ్ బాస్ సీజన్స్ కి కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, సోనియా, మణికంఠ వచ్చి నామినేషన్స్ లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ తో గొడవలు వేసుకుంటే ఎలా ఉంటుందో. ముఖ్యంగా సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణమైన యష్మీ ని ఆమె అంత తేలికగా వదులుతుందా?, నిఖిల్, పృథ్వీ తో తిరుగుతున్నావు, వాళ్ళని నీ చేతుల్లో తోలుబొమ్మలను చేసి ఆడిస్తున్నావు అంటూ అప్పట్లో యష్మీ నామినేషన్స్ సమయంలో సోనియా మీద రెచ్చిపోయింది. సోనియా నోటి నుండి అప్పట్లో మాట పెగలలేదు. అయితే సోనియా బయటకి వెళ్లిన తర్వాత యష్మీ ఆమె స్థానాన్ని తీసుకొని నిఖిల్, పృథ్వీ లను తన గుప్పిట్లో పెట్టుకుంది. కేవలం నిఖిల్ ని తన ప్రేమలో పడేయడానికే , సోనియా మీద అనేక నిందలు వేసి ఆమెని నెగటివ్ చేసినట్టుగా ఆడియన్స్ కి అనిపించింది.

    ఈ విషయం లో సోనియా యష్మీ పై ధ్వజమెత్తి నామినేట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఆడియన్స్ మణికంఠ ని నామినేషన్స్ అప్పుడు బాగా మిస్ అవుతున్నారు. మణికంఠ ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఇలా వచ్చే వారం నామినేషన్స్ ప్రక్రియ వేరే లెవెల్ లో ఉండబోతుంది. అయితే ఈ పాత కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలకు పంపిస్తారా..?, లేదా కన్ఫెషన్ రూమ్ లోకి ఒక్కొక్కరిని పిలిచి నామినేట్ చేయిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది ఇలా ఉండగా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆరు మంది కంటెస్టెంట్స్ లో విష్ణు ప్రియా, అవినాష్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు సమాచారం. వీళ్ళిద్దరిలో అవినాష్ ఎలిమినేట్ అయ్యినట్టు సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.