మల్టీ స్టారర్ అంటేనే పండుగ. అలాంటిది స్టార్ హీరోలే జతకట్టి మల్టీ స్టారర్ గా ఒకే సినిమా లో కనిపిస్తే.. ప్రేక్షుకులకి వచ్చే కిక్కే వేరప్పా. ఇంక రెండు హీరోల ఫ్యాన్స్ కి కన్నుల పండుగ గా వుంటుంది. బాక్స్ ఆఫీసు పై కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పుడు అలాంటి పెద్ద మల్టీ స్టారర్ టాలీవుడ్ లో రాబోతుంది. ఇంతకి ఎవరా స్టార్ హీరోస్ అని తెలుసుకోవాలంటే విషయాల్లోకి వెళ్లాల్సిందే.

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వైపు అడుగులు పడుతున్నాయి. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి వరకు ఏ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేయలేదు. ఒకటే రెండు చోట్ల గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినా ఎక్కడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు అని సమాచారం. తమిళ బ్లాక్ బస్టర్ “విక్రమ్ వేద” తెలుగు రీమేక్ లో వీరిద్దరూ నటించనట్లు టాక్ వినపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టు టేకప్ చేసినట్లు తెలుస్తుండగా ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. విక్రమ్ వేద సినిమా పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో కూడా పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించే అవకాశం ఉండగా విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో చిరంజీవి, మాధవన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. కాగా చిరంజీవి నటించిన ఆచార్య విడుదలకి సిద్ధంగా ఉండగా… నాగార్జున బంగార్రాజు, ది ఘోస్ట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.