Homeఎంటర్టైన్మెంట్Brahmanandam: బ్రహ్మానందం పరుగు...

Brahmanandam: బ్రహ్మానందం పరుగు ప్రకాష్ రాజ్ అని ఎందుకు అన్నారో తెలుసా?

Brahmanandam: రోజు రోజుకు సోషల్ మీడియాను వాడేవారి సంఖ్య పెరుగుతుంది. దాని వినియోగం కూడా అదే రేంజ్ లో పెరుగుతుంది. అయితే ఈ సోషల్ మీడియాలో ఎవరు ఏది ఎప్పుడు ఎందుకు ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టమే. ఇక సినిమాలో డైలాగ్స్, సీన్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. పాత సినిమాలలోని సీన్స్ ను కూడా మీమర్స్ తెగ వాడుతుంటారు. పదేళ్ల క్రితం వచ్చిన సినిమాలోని విషయాల పై కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

తాజాగా ఓ సినిమాలో బ్రహ్మానందం పేరును ఎందుకు అలాపెట్టారో కనిపెట్టి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటి అంటే? సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ లో ఎక్కువ శాతం స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కు సంబంధించనవే ఉంటాయనే విషయం తెలిసిందే. నెట్టింట్లో కడుపుబ్బా నవ్వించే మీమ్స్,ట్రోల్స్ లో తప్పనిసరిగా బ్రహ్మానందం ఉంటారు. బ్రహ్మానందం లేకుండా ట్రోలర్స్, మీమర్స్ వీడియోను క్రియేట్ చేయలేరు అనే రేంజ్ కు ఎదిగారు.

ఈ మధ్య కాలంలో ఓటీటీల వాడకం బాగా పెరిగింది. ఓటీటీలో సినిమాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు చూస్తూ.. వాటిలోని మిస్టెక్స్ ని కనిపెట్టడం, ఒక సినిమాకు ఇతర సినిమాలకు ఉన్న పోలికలు కనిపెట్టడం, సినిమా మధ్య ఉన్న, కనెక్షన్స్ ని కనిపెట్టడం లాంటివి చేస్తూ వాటిని మీమ్స్ రూపంలో పాపులర్ డైలాగ్స్ ని కూడా యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాజాగా కిక్ సినిమాలో బ్రహ్మానందానికి సంబంధించిన మీమ్ వైరల్ గా మారింది.

2009లో రిలీజ్ అయిన కిక్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్స్ ఎంతగా క్లిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని ఒక సీన్ లో బ్రహ్మానందం నేను పరుగు ప్రకాష్ రాజ్ అని చెబుతాడు. అయితే ఆ సీన్ లో బ్రహ్మానందం హెయిర్ స్లైట్, పరుగు మూవీలో ప్రకాష్ రాజ్ హెయిర్ స్టైలో సేమ్ ఒకేలా ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారా అని నెట్టింట్లో మీమ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివి బాగానే కనిపెడుతున్నారు. అయితే వీరికి నెటిజన్లు కూడా తమదైన స్టైల్ లో స్పందిస్తుంటారు.

Get notified whenever we post something new!

Continue reading

Telegram CEO Pavel Durov: కంపెనీలను తయారు చేయాలి అనుకుంటే ఆ సబ్జెక్టు నేర్చుకోవాలి

Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సూచనలు, సలహాలు అందించారు. భవిష్యత్తులో మంచి కంపెనీలను స్థాపించాలంటే,ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలంటే వారికి ఏ సబ్జెక్ట్ మంచిదో తెలిపారు. ఎలాంటి సబ్జెక్ట్‌ను ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆయన చేసిన సూచనలు సలహాలు ఏంటి అనుకుంటున్నారా? ఈ విషయమై...

Male Ear Piercing: అబ్బాయిలు చెవి కుట్టించుకుంటే బెటరా? కాదా? ఏది నిజం?

Male Ear Piercing: హె డియర్స్. ఇప్పుడు మనం ఒక భలే ఇంట్రెస్ట్ టాపిక్ గురించి తెలుసుకుందామా? సాధారణంగా ఆడవాళ్లు చెవులు కుట్టించుకుంటారు. అదంతా బాల్యంలోనే జరుగుతుంది. తర్వాత కావాలి అంటే చెవిలోనే కాస్త పైకి మధ్యలో కూడా చెవి కుట్టించుకొని అలంకరించుకుంటారు. కానీ అబ్బాయిలకు కూడా ఈ చెవి పోగులు ఉంటాయి. ఇలాంటి...

Health Alert: సమోసా, వడపావ్, జిలేబీ లు తింటున్నారా?

Health Alert: సమోసా, వడ పావ్, జిలేబీ, గులాబ్ జామూన్ ల పేరు వింటే చాలు ఎంత నోరు ఊరుతుంది కదా. ఇవంటే చాలా మందికి ఇష్టం. కనిపిస్తే నోరూ ఊరడమే కాదు గుటుక్కుమన మింగేస్తారు చాలా మంది. కానీ మీరు కూడా ఇలాగే తింటే ఓ హెల్త్ వార్నింగ్ వచ్చింది. దాని గురించి...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version