ఈ నేపథ్యంలో.. ఇక మిగిలింది థియేటర్లను పూర్తిగా మూసేయడమే అని అంటున్నారు. ఏప్రిల్ మూడో వారం నుంచి థియేటర్లను క్లోజ్ చేస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరి, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ పరిస్థితిపై ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందించారు.
ప్రభుత్వాలు 50 శాతం నిబంధన అమలు చేయకముందే.. ప్రజలే దాన్ని అమల్లోకి తెచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో.. థియేటర్ కు రావడానికి భయపడుతున్నారని, దీంతో.. 50 శాతం కూడా కాకుండా 25 శాతానికే ఆక్యుపెన్సీ పడిపోయిందని అంటున్నారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన వకీల్ సాబ్.. ఇప్పుడు డీలా పడిపోవడానికి కారణం ఇదేనని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న దాదాపు 1800 థియేటర్లలో.. 1500 థియేటర్లకు ఇప్పుడు సినిమానే లేదని, అందువల్ల అలాంటి థియేటర్లను మూసేయడమే మేలని అన్నారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. అలా కాకుండా నడిపితే.. కరెంటు బిల్లలు కూడా రావని అన్నారు.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఏషియన్ గ్రూప్ సీఈవో చెబుతున్నారు. గతేడాది టీకాలు లేవు. ఇప్పుడు ఉన్నాయి. కానీ.. జనాలకు అందుబాటులోకి రావట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టీకాలు అందరికీ అందిస్తే.. ఈ విపత్తు నుంచి త్వరగా బయటపడొచ్చని అన్నారు.
మొత్తానికి.. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ప్రభుత్వాలు థియేటర్లు మూసేయకుండానే.. సినిమా ఇండస్ట్రీనే స్వయంగా మూసేసే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే పలు చిత్రాల షూటింగులు కూడా ఆపేశారు. మరి, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? థియేటర్లను అధికారికంగా మూసేస్తుందా? అన్నది చూడాలి.