Shakeela: బిగ్ బాస్ హౌస్లో జీవితం అంత ఈజీ కాదు. మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఎమోషన్స్ టెస్ట్ చేస్తాడు. కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు దూరంగా, ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకడం నరకం చూపిస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ ఈజీగా ఏడ్చేస్తుంటారు. అలాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అక్కడ ఉన్నదే తినాలి కానీ… నచ్చింది దొరకదు. వీటన్నింటికీ మించి అలవాట్లు అదుపులో పెట్టుకోవాలి.
ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లకు చాలా కష్టం. అయితే కొన్నింటికి బిగ్ బాస్ హౌస్లో పర్మిషన్ ఉందని తెలుస్తుంది. ఆల్కహాల్ అనుమతించరు కానీ సిగరెట్ తాగొచ్చు. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యాక షకీలా తీవ్ర ఒత్తిడికి గురైంది. ఫస్ట్ డే నుండి తనతో సన్నిహితంగా ఉంటున్న కిరణ్ రాథోడ్ ఇంటి నుండి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యింది. బాగా అప్సెట్ అయిన షకీలా సిగరెట్ వెలిగించింది.
షకీలా సిగరెట్ తాగుతుండగా దామిని వెళ్ళింది. షకీలా సిగరెట్ తాగుతున్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. దీంతో బిగ్ బాస్ హౌస్లో సిగరెట్ తాగొచ్చా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ హౌస్లో సిగరెట్ తాగడం ఇదే మొదటిసారి కాదు. తనీష్, హమీద, తనీష్, చలాకీ చంటి, లోబో వంటి కంటెస్టెంట్స్ స్మోకింగ్ చేశారు. సీజన్ 6లో బాలాదిత్య సిగరెట్ కోసం పెద్ద రచ్చ చేశాడు.
అయితే బిగ్ బాస్ హౌస్లో ఎక్కడబడితే అక్కడ సిగరెట్ తాగకూడదు. దానికంటూ ఓ ఏరియా ఏర్పాటు చేశారు. ఆ స్మోకింగ్ జోన్లో మాత్రమే అలవాటు ఉన్నవాళ్లు దమ్ముకొట్టాలి. ఈ విజువల్స్ బిగ్ బాస్ చూపించడు. ఒకవేళ ఇద్దరు దమ్ముకొడుతూ ఏదైనా సీరియస్ మేటర్ డిస్కస్ చేస్తుంటే మాత్రం చూపిస్తాడు. కాగా బిగ్ బాస్ తెలుగు ప్రారంభానికి ముందు హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సెన్సార్ లేకున్నా ప్రసారం చేయడానికి వీలులేదు అన్నారు. మరి షకీలా స్మోకింగ్ సన్నివేశాలు ప్రసారం కావడంతో సెన్సార్ ఉందా లేదా? అనే సందేహం కలుగుతుంది.