Evaru Meelo Koteeswarulu :భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న షో లలో ఒకటి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ఆగష్టు 22న అంగరంగ వైభవంగా ప్రారంభించగా… అతిధిగా స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్ కి 11.40 రేటింగ్ దక్కింది. దీంతో ఈ షో చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొంది.

సామాన్యులను కొటోశ్వరులగా చెయ్యడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. ‘స్టార్ మా’ లో ప్రసారం మీలో ఎవరు కోటీశ్వరుడు విజయ ప్రదంగా నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ కింగ్ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి నడిపించారు. తాజా గా ఐదో సీజన్ జెమినీ టీవీ లో ప్రసారం కాగా దీనికి జూ.ఎన్టీఆర్ హోస్టింగ్ చెయ్యడం తో భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఎవరు మీలో కోటీశ్వరులు’ ఫస్ట్ వీక్ రేటింగ్ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత నుంచి దీనికి ప్రేక్షకుల స్పందన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ అద్భుతమైన హోస్టింగ్‌తో ఇది ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తోంది. దీంతో రెండో వారం 6కు దగ్గరగా రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత మూడో వారం కూడా మరికాస్త పెరిగింది. నాలుగో వారం ఏకంగా 6.18 రేటింగ్ దక్కింది
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఐదో వారం టీఆర్పీ రేటింగ్ పడిపోడానికి కారణం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. సరిగ్గా ఈ షో ప్రసారం అయ్యే సమయంలోనే మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. అందుకే దీనికి ఆదరణ తగ్గిపోయిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో రేటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.