Mallemala Entertainments: మనం ఎదగాలంటే మన పక్కనున్న వాడిని తొక్కేయాలి.. అందుకు పీత కథ బాగా చదవాలంటారు. ఇదే విషయం ఓ సినిమాలో చెబుతారు. అయితే బుల్లితెరపై ఓ కమెడియన్ దీనిని బాగా ఒంటబట్టించుకున్నట్టున్నాడు. అందుకే తన పక్కనున్నవారిని ఎదగనీయకుండా.. తానొక్కడే బతకాలి అన్నట్లు ప్రవర్తిస్తున్నాడట. ఇలాంటి ఆయన చేష్టలతో ఆయన తోటి కమెడియన్లనే కాకుండా .. ఏకంగా జబర్దస్త్ షోనే సంకనాకించాడు. దీంతో ఒకప్పుడు స్వర్ణయుగంలా సాగిన జబర్దస్త్ ఇప్పుడు రేటింగ్ లో అట్టడుగుకు చేరింది. అందుకు కారణం ఈ కమెడియన్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ కమెడియన్, మల్లెమాలకు చెందిన కొందరితో సీక్రెట్ ఒప్పందాన్ని చేసుకొని టీవీల్లో కామెడీ కాకుండా తన జేబులు నింపుకున్నాడట. ఇప్పుడిదే బుల్లితెరపై జోరుగా ప్రచారానికి కారణం అవుతోంది.

జబర్దస్త్ ప్రొగ్రాం ఎందరి జీవితాలనో నిలబెట్టింది. ఇప్పుడు సినిమాల్లో మంచి పొజిషన్లో ఉన్నవారిలో కొందరు జబర్దస్త్ లో నటించిన వాళ్లే. అయితే సినిమాల్లో బిజీగా మారడంతో పాటు ఇతర కారణాలతో దాదాపు మొదటి నుంచి ఉన్నవారంతా బయటకి వచ్చారు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా మారారు. కానీ జబర్దస్త్ మాత్రం కొత్త కమెడియన్లకు అవకాశం ఇస్తుండడంతో వారి టాలెంట్లకు వేదికగా మారింది. ఈ క్రమంలో కొందరు మంచి వినోదాన్ని అందించి ఫేమస్ అయ్యారు కూడా. అయితే ఓ కమెడియన్ మాత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం పక్కనబెట్టి ఆర్థికంగా ఎదిగేందుకు అడ్డదారులు తొక్కుతున్నాడట.
ప్రతి ఒక్కరికి ఎదగాలన్న ఆశ ఉంటుంది. అందుకు ప్రతిభ తోడైతే సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ ప్రతిభ ఉన్నవాళ్లను తొక్కేయడానికి ఆ కమెడియన్ కన్నింగ్ బుద్దిని అలవర్చుకున్నాడట. తానొక్కడే ఎదగాలన్న అత్యాశతో ఉన్నాడు. ఈ క్రమంలో తన స్థానాన్ని కాపాడుకునేందుకు మల్లెమాలకు చెందిన కొందరితో సీక్రెట్ ఒప్పందాన్ని ఏర్పరుచుకున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా తనకు తెలిసిన బంధువులను జబర్దస్త్ లోకి లాగుతున్నాడట. వారికి కామెడీ చేయడం రాకపోయినా సరే.. ఈ ప్రొగ్రాంలో కొనసాగేలా రహస్య ఒప్పందం చేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్లది కామెడీ వర్కవుట్ కాకనే జబర్దస్త్ రేటింగ్ డౌన్ అయిందని అంటున్నారు.

మొత్తంగా టాలెంట్ ఉన్న కమెడియన్లను ఆ నటుడు పక్కన బెట్టేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. జబర్దస్త్ లోనే కాకుండా ఇతర ఈవెంట్లు, కార్యక్రమాల్లో జబర్దస్త్ నటులు వెళితే.. అక్కడ కూడా వారికి అవకాశం రానివ్వకుండా అడ్డుకుంటున్నాడట. తనకు సంబంధించిన వారికే చాన్స్ వచ్చేలా చేసుకొని డబ్బులు ముట్టజెబుతున్నాడట. ఇలాంటి దుష్ట చేష్టలకు పాల్పడుతున్న ఆయన కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర చానెళ్లలోనూ కనిపిస్తూ ఇతరులను వంచిస్తున్నట్లు బుల్లితెర ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని మిగతా చానెళ్లతో జబర్దస్త్ రేటింగ్ డౌన్ అయ్యేలా చేయాలన్న సీక్రెట్ ఒప్పందాన్ని కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 8 సంవత్సరాలుగా ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన జబర్దస్త్ కార్యాక్రమంలోకి విషపు చుక్కలాగా ఆ కమెడియన్ చేరడంతో సర్వనాశనం అయిందని పలువురు ఇన్ సైడ్ గా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న జబర్దస్త్ లో వినోదం మాట అటుంచిదే.. ఆ కమెడియన్ కు చెందిన వారి హంగామే ఎక్కువైందని అనుకుంటున్నారు. మరి ఈ నటుడి పీడ విరగడై అతని బండారం ఎప్పుడు బయటపడుతుందోనని ప్రతిభ గల నటులు ఆశగా ఎదురుచూస్తున్నారు.