Prabhas Sukumar movie: ఇంటలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ‘ఆర్య’ సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత చేసిన ‘జగడం’ సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికి దర్శకుడిగా అతనికి గొప్ప గుర్తింపైతే వచ్చింది… ఇక ఆ తర్వాత నుంచి ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఏది ఏమైనా కూడా అతని నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి… రామ చరణ్ తో రంగస్థలం చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప 2’ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించాడు. 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సినిమా కావడంతో ఇండియా వైడ్ గా సుకుమార్ పేరు మారుమ్రోగిపోతుంది. అలాంటి దర్శకుడు ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ కి ఒక కథను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ ను కలిసి కథను కూడా వినిపించారట. ఇందులో ప్రభాస్ డాక్టర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇది ఒక సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఉన్న లైనప్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా తెరకెక్కటానికి మరో రెండు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆలోపు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమాని కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…