https://oktelugu.com/

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ప్రేమికులకు భారీ షాక్… షో ఆపేయాలని డిసైడైన స్టార్ మా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో ఆపేస్తున్నారంటూ పరిశ్రమలో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. స్టార్ మా ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు. స్టార్ మా బిగ్ బాస్ షో కోసం భారీగా ఖర్చు చేస్తుంది. కోట్లు ఖర్చుపెట్టి అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద హౌస్ సెట్ వేస్తారు. ఇక కంటెస్టెంట్స్, హోస్ట్ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా చెల్లిస్తుంది. అలాగే మిగతా ఈవెంట్స్ పక్కన పెట్టి ప్రైమ్ టైం లో […]

Written By:
  • Shiva
  • , Updated On : September 27, 2022 / 09:32 AM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో ఆపేస్తున్నారంటూ పరిశ్రమలో షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. స్టార్ మా ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు. స్టార్ మా బిగ్ బాస్ షో కోసం భారీగా ఖర్చు చేస్తుంది. కోట్లు ఖర్చుపెట్టి అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద హౌస్ సెట్ వేస్తారు. ఇక కంటెస్టెంట్స్, హోస్ట్ రెమ్యూనరేషన్ రూపంలో భారీగా చెల్లిస్తుంది. అలాగే మిగతా ఈవెంట్స్ పక్కన పెట్టి ప్రైమ్ టైం లో ప్రసారం చేస్తున్నారు. మరి ఇంత పెట్టుబడి పెడుతున్నప్పుడు అదే స్థాయిలో టీఆర్పీ ఉండాలి.

    nagarjuna

    కానీ బిగ్ బాస్ తెలుగు 6 ఎన్నడూ లేని విధంగా దారుణమైన టీఆర్పీ రాబడుతుంది. కనీసం సీరియల్స్ తో కూడా పోటీపడలేకపోతుంది. బిగ్ బాస్ ఎపిసోడ్స్ కి కేవలం 2 నుండి 2.5 రేటింగ్ మాత్రమే వస్తుందట. కనీసం హోస్ట్ నాగార్జున సారధ్యంలో సాగే వీకెండ్స్ లో అయినా మెరుగైన రేటింగ్ వస్తుంది అనుకుంటే… అది కూడా లేదట. వీకెండ్స్ లో బిగ్ బాస్ 6 రేటింగ్ 3 నుండి 3.5 గా ఉంటుందట. కొన్ని పాప్యులర్ సీరియల్స్ 10 టీఆర్పీ ఈజీగా తెచ్చుకుంటుంటే… బిగ్ బాస్ దారుణంగా కనీసం అందులో సగం రాబట్టలేకపోతుంది.

    పెట్టుబడికి వస్తున్న ఆదాయానికి పొంతలేకుండా పోతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కష్టమే అంటున్నారు. స్టార్ మా బిగ్ బాస్ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పే అవకాశాలను కొట్టిపారేయలేం. హోస్ట్ నాగార్జునలో కూడా మునుపటి ఎనర్జీ కనిపించడం లేదు. టీఆర్పీ ఒత్తిడిలో పడి ఆయన ఎంటర్టైనింగ్ గా హౌస్ ని నడపలేకపోతున్నాడు. గత సీజన్స్ లో బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ అంటే ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి చూపించేవారు. దానికి తగ్గట్లే టీఆర్పీ రేటింగ్ వచ్చేది. బాగా ఆడటం లేదంటూ కంటెస్టెంట్స్ ని తిట్టడమే పెట్టుకుంటున్న నాగార్జున ఎంటర్టైనింగ్ పార్ట్ మర్చిపోతున్నారు.

    Bigg Boss 6 Telugu

    ఇక మూడు వారాలు గడుస్తున్నా షో పుంజుకున్న దాఖలాలు లేవు. గతంలో అసలు పరిచయం లేని కంటెస్టెంట్స్ ని హౌస్ కి పంపారు. అయినప్పటికీ మంచి టీఆర్పీ దక్కింది. బిగ్ బాస్ 6 మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. 21 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలైంది. రెండవ వారం షాని, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. మూడవ వారం నేహా చౌదరి హౌస్ నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం హౌస్ లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

    Tags