https://oktelugu.com/

‘83’ మూవీపై కరోనా ఎఫెక్ట్

చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలోలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిత్రసీమను బెంబెలెత్తిస్తుంది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడుతున్నాయి. దీంతో సెలబ్రిటీలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 11, 2020 / 11:48 AM IST
    Follow us on

    చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా 3వేలకుపైగా మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ కరోనా వైరస్ ఇండియాకు చేరింది. దీంతో భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలోలో 30కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిత్రసీమను బెంబెలెత్తిస్తుంది.

    కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడుతున్నాయి. దీంతో సెలబ్రిటీలు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు.  తాజాగా మీడియాకు అందిన సమాచారం మేరకు బాలీవుడ్ మూవీ ‘83’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో మార్చి 11న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఈ ఈవెంట్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

    1983లో భారత్ ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘83’మూవీకి కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ క్రికెట్ కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌, అలాగే అతడి భార్య రోమి పాత్రలో దీపికా పదుకొణె నటిస్తుంది.  ఇటీవలే1983లో కపిల్‌దేవ్‌ ప్రపంచకప్‌ను అందుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.