Upcoming Movies: కరోనా నేపథ్యంలో గత కొంత కాలంగా చిన్న, పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా OTT ప్లాట్‌ఫామ్స్‌ను నమ్ముకున్నాయి. దీంతో థియేటర్ ఆడియెన్స్ కాస్తా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే పరిమితమయ్యారు. నేటికి కూడా కొందరు మొబైల్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో మూవీ చూస్తూ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్సవుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఎప్పుడైతే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందో సినిమా షూటింగులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీంతో థియేటర్లకు పునర్ వైభవం వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ చాలా ఆలస్యంగా రాష్ట్రంలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.

అఖండతో అదిరిపోయిన రెస్పాన్స్..
మొన్నటి వరకు సినిమాలు లేక థియేటర్లు కూడా బోసిపోయాయి. చిన్న సినిమాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కొంత మేర పరవాలేదని పించి జనాలను సినిమా హాల్స్‌కు రప్పించే ప్రయత్నం చేసింది. ఇక ఎప్పుడైతే నందమూరి నటసింహం అఖండ మూవీ రిలీజ్ అయ్యిందో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. కరోనాకు ముందున్న పూర్వ వైభవాన్ని బాలయ్య తన సినిమాతో తీసుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోవడంతో భారీగా కలెక్షన్ల వరద పారుతోంది.
సంక్రాంత్రి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?
ఈనెల గడిస్తే అందరం కొత్త సంవత్సరంలో అడుగుపెడతాం.. అయితే, వచ్చే ఏడాది మాత్రం సినీ లవర్స్‌కు సినిమాల జాతర కనిపించనుంది. ఈనెల చివరాఖరులో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ ది రైజ్’ రిలీజ్ కానుండగా.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘శ్యాం సింగరాయ్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’, రాజమౌళి చెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు ఉండనే ఉన్నాయి. ఇక చిన్న సినిమాల విషయానికొస్తే ఈ వారం ఏకంగా 8 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆ రెండూ నీకే కావాలంటే.. ఇక నిర్మాతలు ఏమి చేయాలి ?
వీటిలో చెప్పుకోదగ్గవి మాత్రం నాగశౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ మరియు ‘గమనం’ మూవీ పైనే ఉన్నాయి. మొన్నిమధ్య ‘వరుడు కావలెను’ సినిమాతో వచ్చిన శౌర్య ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాడు. అయితే, ‘లక్ష్య’ సినిమాతో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. మొన్నటివరకు క్లాస్‌గా కనిపించిన ఈ హీరో ఒక్కసారిగా మాస్ అవతారమెత్తాడు. 8 ప్యాక్స్ బాడీతో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి మార్కులే పడ్డాయి. స్పోర్ట్ బేస్డ్ మూవీగా లక్ష్య తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఇక గమనం మూవీలో సీనియర్ నటి శ్రియ ప్రధాన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. లక్ష్య, గమనంతో పాటు మడ్డీ, నయీం డైరీస్, బుల్లెట్ సత్యం, కటారి కృష్ణ, మనవూరి పాండవులు, ప్రియతమా వంటి చిత్రాలు ఈ వారం థియేటర్ల ముందుకు రానున్నాయి.. చూద్దాం.. ఇందులో ఏ సినిమాలు విజయం సాధిస్తాయో..
Also Read: Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చిన “పుష్ప” మూవీ టీమ్…