https://oktelugu.com/

‘777 చార్జీ’ టీజర్: లక్ష్యం కోసం కుక్క పోరాటం

‘కిరిక్ పార్టీ’ ఫేమ్ కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘777 చార్లీ’. ఒక కుక్కను ప్రధాన పాత్రగా మలిచి తీసిన ఈ చిత్రంటీజర్ నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. రక్షిత్ పుట్టినరోజును దీన్ని ప్రేక్షకుల కోసం రిలీజ్ చేశారు. ఒక లాబ్రడార్ జాతి కుక్కను ప్రధాన పాత్రలో ఈ టీజర్ లో చూపించారు. అది ఒకరిని కనుగొనడానికి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఇది ఒక ఉద్దేశ్యంతో కూడిన […]

Written By:
  • NARESH
  • , Updated On : June 6, 2021 / 02:35 PM IST
    Follow us on

    ‘కిరిక్ పార్టీ’ ఫేమ్ కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘777 చార్లీ’. ఒక కుక్కను ప్రధాన పాత్రగా మలిచి తీసిన ఈ చిత్రంటీజర్ నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. రక్షిత్ పుట్టినరోజును దీన్ని ప్రేక్షకుల కోసం రిలీజ్ చేశారు.

    ఒక లాబ్రడార్ జాతి కుక్కను ప్రధాన పాత్రలో ఈ టీజర్ లో చూపించారు. అది ఒకరిని కనుగొనడానికి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఇది ఒక ఉద్దేశ్యంతో కూడిన ప్రయాణం. అది.- కుక్క తిండికి నిద్రకు, ఆవాసానికి దూరమై అష్టకష్టాలు పడుతుంది. చాలా కష్టపడి తన వారి వద్దకు చేరుతుంది.

    వర్షంలో ఆహారం కోసం వెంబడించడం.. ఇతర కుక్కలు తరమడం.. తిండికోసం పడ్డ కష్టాలు తీజర్ లో అలరించాయి. కానీ కుక్కను బేస్ చేసుకొని తీసిన ఈ టీజర్ అద్భుతంగా కట్ చేశారనే చెప్పాలి. ఇది ధైర్యమైన ప్రయత్నం అని చెప్పొచ్చు.

    కుక్కకు శిక్షణ ఇచ్చిన వారికి ఈ క్రెడిట్స్ దక్కుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే టీజర్ చివరిలో హీరో రక్షిత్ చేతికి కుక్క చేరుతుంది. నోబిన్ పాల్ సంగీతం.. విజువల్స్ ను బాగా ఔట్ పుట్ వచ్చేలా చేశాయి. ‘777 చార్లీ’గా తెరకెక్కిన ఈ సినిమాకు కిరణ్‌రాజ్ దర్శకత్వం వహించారు. మొత్తంమీద టీజర్ చాలా ఆకర్షణీయంగా ఉంది, పిల్లలు ఆనందించేలా ఉంది.. ఇది పరమ్వా స్టూడియోస్ పతాకంపై రూపొందించబడింది.

    టీజర్ ఇదే