Thandel : అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘తండేల్'(Thandel Movie) బాక్స్ ఆఫీస్ వద్ద 8 రోజుల థియేట్రికల్ రన్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. పైరసీ ద్వారా HD ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాని ఆడియన్స్ థియేటర్స్ లో ఆదరిస్తున్నారు. అక్కినేని హీరోలకు సరైన సినిమా పడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాన్ని అందుకోకుండా ఆపలేరు అనేది ఈ చిత్రం ద్వారా మరోసారి నిరూపితమైంది. ఈ సినిమా విడుదలకు ముందు 40 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకోగా, కేవలం మొదటి వారంలోనే ఆ బిజినెస్ మార్కు ని అందుకొని సంచలనం సృష్టించింది. నాగ చైతన్య కెరీర్ లో ఒక సినిమాకి వారం రోజుల్లో 40 కోట్ల రూపాయిల షేర్ రావడం ఈ సినిమాకే జరిగింది.
ఇక వాలెంటైన్స్ డే(Valentines Day) రోజున ఈ చిత్రం 7 వ రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం విశేషం. ప్రేమికులు ఈ చిత్రాన్ని చూసేందుకు నిన్న ఎగబడ్డారు. ఆ కారణం చేత ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజే రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా నిన్నటితో ఈ చిత్రానికి 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 44 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక శనివారం, ఆదివారం ఎలాగో భారీ వసూళ్లు వస్తాయి కాబట్టి, ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అందుకోనుంది. వచ్చే వారం లో కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటనుంది. అదే కనుక జరిగితే అక్కినేని ఫ్యామిలీ కి మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమా దక్కింది అనుకోవచ్చు.
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తగలడం తో అక్కినేని అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. నాగార్జున కూడా ఈ విజయం పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకున్నాడు. ఈ చిత్రం లో నాగ చైతన్య నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కేవలం ఆయన నటన, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ కారణంగానే ఈ సినిమా ఇంతటి రేంజ్ కి వచ్చిందని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తుండడం అక్కినేని అభిమానులకు ఎంతో గర్వంగా అనిపించింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న తమ హీరోని నమ్మి , అన్ని కోట్ల రూపాయిల బడ్జెట్ ని పెట్టి తీసి సాహసం చేసి సక్సెస్ అయ్యినందుకు అభిమానులు అల్లు అరవింద్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు. త్వరలోనే అల్లు అరవింద్ నాగ చైతన్య ని పెట్టి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ప్లాన్ చేస్తున్నారట.