71 National Flim Awards: సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏ క్రాఫ్ట్ లో పనిచేసిన కూడా అల్టిమేట్ గా వాళ్లకు గుర్తింపు వస్తే మాత్రం రెట్టింపు ఉత్సాహంతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయంలో నేషనల్ అవార్డు అనేది చాలా గొప్పది. ఇండస్ట్రీ లో వర్క్ చేస్తున్న ప్రతి వ్యక్తి తనకు నేషనల్ అవార్డు వస్తే బాగుంటుందని అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రముఖ గేయ రచయిత అయిన ‘ కాసర్ల శ్యామ్’ కి నేషనల్ అవార్డ్ వరించింది. బలగం సినిమాలో ఆయన రాసిన ‘ ఊరు పల్లెటూరు ‘ పాటకు గాను నేషనల్ అవార్డు అయితే వరించింది…ఈ పాట కి అవార్డ్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక తెలుగు పాటకి నేషనల్ లెవల్లో ఆదరణ చాలా తక్కువ సందర్భాల్లో దక్కుతుంది.
Also Read: అందుకే బాలయ్యకు నేషనల్ అవార్డ్ వచ్చిందా..?
శ్రీశ్రీ, వేటూరి, సుద్దాల అశోక్ తేజ తర్వాత ఈ జనరేషన్ లో ఒక తెలుగు పాటకి అంతటి ఘనత ను దక్కించిన రచయిత ‘కాసర్ల శ్యామ్’ కావడం విశేషం…ముఖ్యంగా ఈయన రాసే ప్రతి పాటలో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుంది. ఇక బలగం సినిమాలో ఈయన రాసిన ఊరు పల్లెటూరు పాటలో మట్టి వాసన కనిపిస్తోంది. మూగ జంతువుల భావాలు కనిపిస్తాయి.
ఒక పల్లెటూర్లో నివసిస్తున్న ముసలి ఆవిడ జీవితం కనిపిస్తుంది.పల్లె లో ఉన్న ఒక్కరి ఫీలింగ్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి. అంత అర్థవంతంగా రాసిన ఆ పాటకి నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… మొత్తానికైతే బలగం సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించడానికి ఈ పాట అంత చాలా వరకు ప్లస్ అయింది.
Also Read: బాలయ్య చేసిన ఆ ఒక్క సినిమా ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టిందా..?
ఈ పాటతోనే సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఈ పాట ఇచ్చిన హైప్ తో సినిమాని చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకున్నాడు…కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి సక్సెస్ తీరాలకు చేర్చాడనే చెప్పాలి… ఇక కాసర్ల శ్యామ్ తో పాటు బాలయ్య బాబు హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమాకి కూడా బెస్ట్ సినిమాగా నేషనల్ అవార్డ్ అయితే వచ్చింది. ఇక బేబీ సినిమాకి గాని సాయి రాజేష్ అందించిన స్క్రీన్ ప్లే కి నేషనల్ అవార్డు దక్కింది…