Usha Utup : మధురమైన గొంతు వరం లాంటిది. ఇది కొద్దిమందికే ఉంటుంది. కొన్ని గొంతులో నుంచి వచ్చే స్వరాలు వింటుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది. మరికొందరి వాయిస్ వింటే ఎక్కడలేని ఊపు వస్తుంది. రెండో కోవకు చెందిన గాయని ఉషా ఉతుప్. ఈమె గురించి సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. గంభీరమైన తన గొంతుతో ఎన్నో పాటలు పాడారు. కుర్రాళ్లలో ఊపు తెచ్చే తన వాయిస్ తో ఊర్రూతలెక్కించారు. అయితే ఉషా సింగర్ గానే కాకుండా పర్సనల్ లైఫ్ లోనూ ప్రత్యేకం. అమెకు చీరలంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి కొత్త చీర వచ్చిందంటే దానిని కొనడం ఆమెకు అలవాటు. ప్రస్తుతం ఆమె దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.
ఉషా ఉతుప్ అయ్యర్ కుటుంబం నుంచి వచ్చారు. ఈమె అసలు పేరు ఉషా అయ్యర్. మహారాష్ట్రలోని ముంబైలో తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె బైకుల్లాలోని సెయింట్ ఆగ్నేస్ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టమున్న ఆమె పాఠశాలలో నిర్వహించే పాటల పోటీలో పాల్గొనడానికి ప్రయత్నించింది. కానీ గొంతు సరిగా లేదని ఆమెను రిజెక్ట్ చేశారు. కానీ సంగీత ఉపాధ్యాయుడు మాత్రం ఆమెను పాటలు పాడడానికి ప్రోత్సహించేవారు.
ఆమె తొమ్మిదేళ్ల వయసులో ఉన్న సమయంలో తొలిసారి బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. ఆ తరువాత సంగీత కారుడు అమీన్ సయానీ ఓ రేడియో ఛానెల్ లో పాడడానికి ఉషకు అవకాశం ఇచ్చారు. ఆ తరువత శశికపూర్ తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ‘హరే రామ హరే కృష్ణ’ అనే సినిమాలో మొదటిసారిగా పాడింది. ఈ సినిమాలో ధమ్ మారో ధమ్ అనే పాటను ఇంగ్లీస్ విభాగంలో పాడారు. ఆ తరువాత ఉష సొంతంగా పాటలు పాడిన అల్బమ్ లు విడుదలయ్యాయి. అవి పాపులర్ సాధించాయి.
ఉషా ఉతుప్ సినిమాల్లో సక్సెస్ జీవితాన్ని గడిపారు. అయితే పర్సనల్ లైఫ్ లోనూ ఈమె ప్రత్యేకంగా కనిపిస్తారు. చీరకట్టు, పెద్ద బొట్టుతో సాంప్రదాయంగా కనిపిస్తారు. అయితే ఆమెకు చీరలంటే చాలా ఇష్టం. కొత్త చీర కనిపిస్తే దానిని కబోర్డు పెట్టడం తనకు అలవాటు. అలా ప్రస్తుతం ఆమె దగ్గర 600 చీరలు ఉన్నట్లు ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అమెకు నల్ల చీర అంటే చాలా ఇష్టం. దీనిని ధరించడానికి ట్రైచేస్తే తన అత్తగారు అస్సలు ఓప్పుకునేవారు కాదట. ఎందుకంటే ఆమె అయ్యర్ కుటుంబానికి చెందిన వారు కాబట్టి.