AP CM Jagan – TTD President : టీటీడీకి కొత్త అధ్యక్షుడి వేటలో జగన్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం పూర్తికావడంతో నూతన అధ్యక్షుడి కోసం జగన్ అన్వేషణ ప్రారంభించారు. ఎంపికకు కసరత్తున్నారు. అయితే ఈసారి బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు.

Written By: Dharma, Updated On : July 22, 2023 6:49 pm
Follow us on

AP CM Jagan – TTD President : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం పూర్తికావడంతో నూతన అధ్యక్షుడి కోసం జగన్ అన్వేషణ ప్రారంభించారు. ఎంపికకు కసరత్తున్నారు. అయితే ఈసారి బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ కు అత్యంత విధేయుడిగా ఉన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆయన ఇంటికి నేతలు క్యూకడుతుండడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పదవిపై చాలా మంది మక్కువ పెంచుకున్నారు. కానీ జగన్ మాత్రం ఆ స్థానంలో తన బాబాయ్ సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు. కీలక పదవులు సొంత సామాజికవర్గానికే కేటాయిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఈసారి  చేస్తుబీసీలకు కేటాయించాలని నిర్ణయించారు.

వాస్తవానికి టీటీడీ పీఠంపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ వచ్చిన తొలినాళ్లలో పదవినాదే అన్నట్టు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం మోహన్ బాబును కనీసం పరిగణలోకి తీసుకోలేదు. టీడీడీయే కాదు.. మరీ ఏ ఇతర పదవులు కేటాయించకుండా మోహన్ బాబును సైడ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డిని ఫుట్ టైమ్ అధ్యక్షుడిగా చేయాలని చూసినా.. ఇప్పుడు మప్పేట దాడి ఎదురవుతోంది. బీసీ జపం పఠిస్తున్న తరుణంలో ఎన్నికల ముంగిట ఆ వర్గానికి పదవి కేటాయించేందుకు డిసైడయ్యారు. పది నెలల పాటు నమ్మకమైన బీసీ నేతను నియమించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కర్చిఫ్ వేశారు. అయితే ఆయనపై జగన్ అంత సానుకూలత చూపడం లేదు. ప్రస్తుతం రామచంద్రాపురం వైసీపీలో విభేదాలకు బోస్ కారణమని హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు కాకుండా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా కుమారుడు సూర్యప్రకాష్ ను బరిలో దింపేందుకు బోస్ ప్రయత్నిస్తున్నారు. పచ్చని వైసీపీలో చిచ్చుపెట్టడంతో హైకమాండ్ కు ఫిర్యాదులు వెళుతున్నాయి. తనపై హైకమాండ్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో టీటీడీ పదవిని బోస్ అడగడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వస్తే పదవి.. లేకుంటే తన పని తాను చేసుకోవాలన్నదే బోస్ వ్యూహంగా తెలుస్తోంది.

వచ్చేనెల ఏడో తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగుస్తోంది. ఆరోజు చివరి పాలకమండలి సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే వచ్చే నెల 2, 3 తేదీల్లో కొత్త పాలకవర్గాన్ని ప్రకటించాలని జగన్ నిర్ణయించారు. జంగా కృష్ణమూర్తే కరెక్ట్ వ్యక్తి అని భావిస్తున్నారు. ఆయన పేరు దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి పాల‌న‌లో ఆయ‌న కంటే ధ‌ర్మారెడ్డే పూర్తిస్థాయిలో హ‌వా కొన‌సాగించార‌నే ప్ర‌చారం వుంది. జేఈవోగా, ఈవోగా ధ‌ర్మారెడ్డి టీటీడీని త‌న గుప్పిట్లో పెట్టుకుని, తాను అనుకున్న‌ది చేశార‌ని చెబుతారు. ఇందులో కొన్నింటిపై విమ‌ర్శ‌లు, మ‌రికొన్నింటిపై ప్ర‌శంస‌లు ఉన్నాయి. కొత్త పాల‌క మండ‌లి వ‌స్తే, ధ‌ర్మారెడ్డితో ఎలా వుంటుందో చూడాల‌నే చ‌ర్చ తిరుప‌తి, తిరుమ‌ల‌లో విస్తృతంగా సాగుతోంది.