మెగాస్టార్ క్రేజీ స్టెప్స్ కి 6 లక్షల లైక్స్ !

‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రత్యేక పాట ‘లాహే లాహే’ విపరీతమైన బజ్ తో ఫుల్ వ్యూస్ తో ఇప్పటకే 50 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుంది. పైగా మెగాస్టార్ కెరీర్ లో 50 మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్ తో పాటు 6 లక్షలకు […]

Written By: admin, Updated On : June 8, 2021 7:41 pm
Follow us on

‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రత్యేక పాట ‘లాహే లాహే’ విపరీతమైన బజ్ తో ఫుల్ వ్యూస్ తో ఇప్పటకే 50 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుంది. పైగా మెగాస్టార్ కెరీర్ లో 50 మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇక ఈ సాంగ్ కి 50 మిలియన్ల వ్యూస్ తో పాటు 6 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఆరు లక్షలు లైక్స్ అంటే ఇది మెగాస్టార్ కెరీర్ లోనే మరో రికార్డు. మొత్తానికి ఈ పాట సినిమా విడుదలకు ముందే పెద్ద హిట్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సాంగ్ మధ్యలో వేసిన చిరు క్రేజీ స్టెప్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులో సీనియర్‌ నటి సంగీత కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెయిన్ గా చిరు డ్యాన్స్ లో వింటేజ్ చిరు కనబడ్డారనే కాంప్లిమెంట్స్ రావడంతో ఈ సాంగ్ ను సాధారణ ప్రేక్షకులు కూడా పదేపదే చూశారు. దాంతో ఇంకా ఈ సాంగ్ కి రికార్డ్ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటం, అలాగే చరణ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడంతో ఆచార్య పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో తిరిగి స్టార్ట్ చేయాలని.. కాకపోతే మెగాస్టార్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే జులై సెకెండ్ వీక్ నుండి ఆచార్య షూట్ మొదలుపెడతారట.